
'తెలుగురాష్ట్రాల్లో ఇలా జరగడం దురదృష్టకరం'
ఓటుకు నోటు కుంభకోణం గతంలో పార్లమెంటులో చూశామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కుంభకోణం గతంలో పార్లమెంటులో చూశామని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ వ్యాఖ్యానించారు. కానీ మన తెలుగురాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతాయని ఊహించలేదని అన్నారు.
సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ ఘటనపై దర్యాప్తు అవసరమని సీతారం ఏచూరీ తెలిపారు.