ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) మరో అడుగు ముందుకు వేయనుందన్న విషయం తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానాహడావుడి చేశారు. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయబోతోందన్న సమాచారం మంగళవారం సచివాలయంలో హైడ్రామా నడిపించారు. అసలు కేసును పక్కదారి పట్టించడానికి కొత్త ప్లాన్ రచించారు. ఏ క్షణంలోనైనా ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న సమాచారంతో ఉలిక్కిపడిన చంద్రబాబు మంగళవారం ఉదయం ఇంట్లోనే డీఐజీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధతోపాటు ఇతర ఉన్నతాధికారులతో రహస్య మంతనాలు సాగించారు.
Published Wed, Jun 17 2015 11:19 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement