'ఆ స్వరం ఎవరిదో అందరికీ తెలుసు'
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు చాలా సీరియస్ అంశమని సీపీఐ నారాయణ చెప్పారు. సోమవారం న్యూఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆడియో టేపుల్లో వినిపించిన స్వరం ఎవరిదో అందరికీ తెలుసు' అని అన్నారు. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను శిక్షించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
కాగా, మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని నేడు ఏసీబీ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ కేసు నేపథ్యంలో పలు సందర్భాలలో చంద్రబాబు మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు కోట్లు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన ఒక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వాటి ఆధారంగానే ఏసీబీ కోర్టులో కేసు దాఖలు చేశారు.