'సిగ్గు పడాల్సింది పోయి మీసం మెలేస్తాడా?'
హన్మకొండ(వరంగల్): ఓటుకు కోట్లు కేసులో బెయిల్‌పై విడుదలైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సిగ్గుపడాల్సింది పోయి, మీసం మెలేస్తాడా?, ఏం గొప్ప పనిచేశాడని హైదరాబాద్ నిండా పోస్టర్లు, ర్యాలీలు..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. గురువారం వరంగల్‌కు వచ్చిన ఆయన హన్మకొండలోని సుందరయ్యభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
అవినీతి కంపుతో రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీ మారడం సరికాదన్నారు. ఒకప్పుడు పార్టీ సిద్ధాంతాలు, పద్ధతులు నచ్చక పార్టీలు మారేవారు.. ఇప్పుడేమో పదవుల కోసం పార్టీలు మారుతున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ఇలాంటి రాజకీయాలతో బంగారు తెలంగాణ సాధించడం కష్టమేనన్నారు. సామాజిక సమానత్వం పాటించినప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయనీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు అవి లేవన్నారు.