జాతీయ నాయకులకు పిండ ప్రదానం | nayakulaku pinda pradanam | Sakshi
Sakshi News home page

జాతీయ నాయకులకు పిండ ప్రదానం

Published Mon, Aug 22 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

nayakulaku pinda pradanam

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో, స్వతంత్ర భారతావనిని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలకపాత్ర పోషించి అమరులైన దివంగత జాతీయ మహానేతలకు కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానం చేసినట్టు అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు ఎంబీఎస్‌ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం తమ సమాఖ్య ఆధ్వర్యంలో దళితులతో కలిసి సమతా స్నానం ఆచరించిన అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ పుష్కరాల్లో తమ సమాఖ్య సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వలంటీర్లుగా ఉంటూ వృద్ధులకు, దివ్యాంగులకు పవిత్ర స్నానం ఆచరించడంలో సహకరిస్తున్నారని తెలిపారు. కృష్ణా పుష్కరాల పవిత్రత– ప్రాముఖ్యత అనే పుస్తకాలను భక్తులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement