స్వాతంత్య్రం కొందరికే జన్మహక్కు | freedom is a birthright, only to some, writes kobad gandhi | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రం కొందరికే జన్మహక్కు

Published Sun, Aug 16 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

స్వాతంత్య్రం కొందరికే జన్మహక్కు

స్వాతంత్య్రం కొందరికే జన్మహక్కు

సందర్భం
 
నేర న్యాయ వ్యవస్థ సాగతీత ఫలితంగా జైలు లోపలి జైలులో (తీహార్ కారాగా రంలోని హైరిస్క్ విభాగం) ఆరేళ్ల నుంచి మగ్గుతున్న నన్ను స్వాతంత్య్రం గురించి రాయమని అడగడం వెటకారమే. జబ్బు పడినప్పుడు ఆస్పత్రికి వెళ్లడానికి గానీ, చివరికి ప్రధాన కారాగార ప్రాంగణం లోకి  వెళ్లడానికి గానీ ఇక్కడ ఎంత మా త్రం స్వేచ్ఛ లేదు.

ఒక కొసన అరాచకత్వం, మరో కొసన కేంద్రీకృత ప్రజాస్వామ్యాలతో స్వాతంత్య్రం సాపేక్షంగా ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్నవాటిలో కొన్ని వ్యవస్థలు ఇతర వ్యవస్థల కంటే ఎక్కువ స్వాతంత్య్రం కలిగి ఉన్నాయి. భార తదేశంలో వెండితెర వేల్పులు, క్రికెట్ తారలు, వాణిజ్య, రాజకీయ రంగ ప్రముఖులు వీలైనంత స్వాతంత్య్రం అనుభవించగలుగు తారు. ఆఖరికి హత్య చేసి కూడా తప్పించుకోగలరు. కానీ పేద రైతులు రెండు పూటలా సరైన తిండికి నోచుకోరు. అస్వస్థులైతే వారి పిల్లలు వైద్యానికి కూడా నోచుకోరు. నా వరకు జైలు జీవితం అంటే, ఒంటరితనపు భీతిని అనుభవిస్తున్న మనిషికిస్వాతంత్య్రా న్ని నిరాకరించడమే. కానీ ఇది సామాన్య నేరగాడికి వర్తించదు. అతడు జైలు జీవితానికి అలవాటు పడిపోతాడు. తన నేర కార్యక లాపాలను సైతం అక్కడ నుంచే నిర్వర్తించుకుంటాడు. జైలులో స్వాతంత్య్రం లేదన్న అంశమే అతడికి పట్టదు. వారిలో చాలామం ది విడుదలైనప్పటికీ కావాలని మళ్లీ జైలుకు తిరిగి వస్తుంటారు.

స్వాతంత్య్రం అనేది బాగా వక్రీకరణకు గురైన మాటలలో ఒకటి. పాశ్చాత్య దేశాల పత్రికలు కొన్ని విలువలను సున్నితంగా నూరిపోసి దాన్నే స్వాతంత్య్రమని భ్రమింపజేస్తున్నారు. నియం త్రిత ఆంక్షల మధ్య పనిచేసే చైనా మీడియాలో మాత్రం అలాంటి స్వేచ్ఛ లేదని చెబుతారు. భారత్, అమెరికా దేశాలు ప్రపంచం లోనే గరిష్టంగా స్వాతంత్య్రం అనుభవిస్తున్న అతి పెద్ద ప్రజాస్వా మిక వ్యవస్థలుగా పేరుపొందాయి. అయితే అలాంటి స్వాతం త్య్రాన్ని మీరు అనుభవిస్తున్నారా అని అమెరికాకు చెందిన ఒక నల్ల జాతీయుడిని, లేదా భారతదేశంలో ఒక దళితుడిని అడగండి. ఇప్ప టి బ్రాహ్మణీయ పాలకులకంటే, వెళ్లిపోయిన బ్రిటిష్ వారే ఎంతో మెరుగని దళితులు తరచూ భావిస్తుంటారు. బ్రిటిష్ కాలంలో కుల అణచి వేతలు మరీ బరితెగించలేదు. ఆ విషయంలో అగ్రకులాలు ఎంతో క్రూరంగా, అమానవీయంగా ఉన్నాయి.

మరీ దారుణం అనకపోయినా మాటలకు సంబంధించిన ఇలాంటి వక్రీకరణ చాలా కోణాల నుంచి కనిపిస్తుంది. ఉదాహ రణకి పోలీసులనీ, మా ఖైదీలను తీసుకోండి. వేసవిలో ఒక్కరు కూర్చున్నా కూడా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండే వ్యాను లో 3/3 కొలతలున్న ప్రదేశంలో కుక్కుతారు. ఇక్కడ ఆరోగ్య పరిస్థితి, వయసు ఏదీ పరిగణనలోనికి రావు. కోర్టు లాకప్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి వారిని అవమానకరమైన రీతిలో తనిఖీ చేస్తారు. ఆ తనిఖీలో ఒక పెన్ను దగ్గర ఉన్నా అనుమానించదగినదే (కొన్ని సందర్భాలలో కళ్లజోడు కూడా). ఇక్కడ  బంధువులను కలుసుకో వడానికే కాదు, మా న్యాయవాదులను కలుసుకోవడానికి కూడా చాలామంది ఇన్‌స్పెక్టర్లు మమ్మల్ని అనుమతించరు.

కానీ ఇలాంటి సమస్య మాకేదీ ఎదురు కాలేదని జైలులో డాన్‌లు చెబుతారు. ఆ వ్యాన్‌లలో వచ్చే పోలీసులు తరచుగా భారతదేశంలో స్వాతం త్య్రం, ప్రజాస్వామ్యాల గురించి అనర్గళంగా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. పలు నిబంధనలు, ఆఖరికి ఎన్నో తీర్పులు శిక్ష పడిన ఖైదీల (రిమాండ్ ఖైదీల సంగతి చెప్పక్కరలేదు) పట్ల మర్యాదగా వ్యవహరించాలనే చెబుతున్నాయి. కానీ ఇది పుస్తకాలకే పరిమి తం. జైలు గోడల మధ్య ఉన్నవారి ఆత్మ గౌరవాన్ని గాయపరచ డం అనేది నేర న్యాయవ్యవస్థకు మామూలైపోయింది. అయితే మీరు ఒక వ్యాపార ప్రముఖుడో, సినిమా నటులో, ఇంకా డాన్ అయితే ఇలాంటిదేమీ జరగదు.

మిగిలిన వ్యవస్థలతో పోల్చుకుంటే న్యాయవ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఇటీవల కొన్ని ప్రశ్నార్థక మైన తీర్పులు వెలువడడం గమనిస్తాం. నా కేసునే తీసుకోండి.  నాది కాని నేరాంగీకారం ఆధారంగా దీనిని నమోదు చేశారు. తెలంగాణ పోలీసుల అధీనంలో ఉండగా నేను సంతకం కూడా చేయని, నేను చదవలేని, రాయలేని, అర్థం చేసుకోలేని భాషలో (తెలుగు) తయారైన నేరాంగీకారం ఆధారంగా ఈ కేసు పెట్టారు. దీనిని నేను కోర్టులో ఖండించినప్పటికీ కేసు నమోదైపోయింది. పది నుంచి పదిహేను కేసుల వరకు నా మీద మోపారు. రెండు కేసులలో  చార్జిషీట్లు దాఖలైనప్పటికీ, హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ నా మీద ఇంకా కేసులు పెండింగ్‌లోనే ఉంటాయి.

ఢిల్లీ నగరంలో నా మీద నమోదైన కేసు విచారణ పూర్తయ్యే వరకు, ఢిల్లీ బయట నమోదైన కేసులకు సంబంధించి నేను కోర్టులకు హాజరు కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయ డమే ఇందుకు కారణం. కాబట్టి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తెలం గాణ/ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల మీద కూడా తన వాస్తవ అధి కారాన్ని రూఢీ చేసుకున్నారు. ఇవన్నీ చూస్తే స్వాతంత్య్రం అనేది సాపేక్షమే కాకుండా, సంచలనాత్మకం కూడా అనిపిస్తుంది. నిజా నికి, మానవత్వం, న్యాయం లేకుండా స్వాతంత్య్రానికి అర్థంలేదు. పాశ్చాత్య పదాలలో తప్ప నైరూప్య స్వాతంత్య్రం అనేది లేనేలేదు. ఎవరైనాగానీ స్వా తంత్య్రం గురించి తక్కువ గాను, మానవత, న్యాయాల గురించి ఎక్కువగాను మాట్లాడవలసిన అవసరం ఉంది. వీటి ఫలితం తప్పనిసరిగా స్వాతంత్య్రమే కావాలి.
(వ్యాసకర్త మావోయిస్టు నేత. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద తీహార్ జైలులో ఉండి విచారణను ఎదుర్కొంటున్నారు.)

- కోబడ్ గాంధీ

(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement