స్వాతంత్య్ర సమర యోధుడు కన్నుమూత
– క్వింట్ ఇండియా ఉద్యమంలో పాత్ర
– కేథారి గోవిందప్ప మృతికి పలువురి సంతాపం
కోసిగి: స్వాతంత్ర సమరయోధుడు కేథారి గోవిందప్ప(95) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కోసిగికి చెందిన కేథారి అనుమంతప్ప, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు కేథారి గోవిందప్ప 1921లో జన్మించారు. అప్పట్లో 8వ తర గతి వరకు చదువుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1942లో క్విటిండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉల్లిగడ్డల ఈరన్న నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు. బళ్లారి జిల్లా అల్లిపూర్ జైలులో ఆరు నెలల పాటు శిక్ష అనుభివించారు. ఉద్యమంలో కోసిగి నుంచి కేథారి గోవిందప్ప, మట్టె ఈరన్న, భీమన పల్లి చిన్న లక్ష్మయ్య, ఏసే నారాయణప్ప, శంకర్ పిళై ్లలు కీలక పాత్ర పోషించారు. వీరికి స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వ మెమెంటోలు, జ్ఞాపికలు అందించారు. కేథారి గోవిందప్ప..ఏటా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు దేశ ప్రగతిపై పలు సూచనలు ఇచ్చేవారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఎమ్మిగనూరులోని అన్యూష్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ బుధశారం మతి చెందాడు. గోవిందప్ప మతికి కోసిగి పూర్వపు విద్యార్థుల సంఘం, ఉపాధ్యాయ సంఘం, ఏపీయూడబ్ల్యూజే నాయకులు సంతాపం ప్రకటించారు.