రష్యా దాడిని తట్టుకుని నిలబడటమే గాక కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ధీమాగా అన్నారు. ఈ మేరకు జెలెన్ స్కీ సోమవారం జరిగిన వార్షిక "ది డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్" సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, మిలటరీకోసం వంట చేస్తున్న గ్రామస్తులు, యూనిఫాంలు కుడుతున్న టైలర్లు, ప్రమాదం ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులు తదితరులందర్నీ ఈ యుద్ధ సమయంలో తమ వంతుగా సాయం అందించినందుకు ప్రశంసించారు
తరచుగా క్షిపణి దాడులు, విస్తృత విధ్వంసం ఉన్నప్పటికీ వాటన్నింటని తట్టుకుని ఉక్రెనియన్లు తమ వంతుగా సేవలందించారని కొనియాడారు. తాము డబ్బు, పెట్రోల్, వేడి నీరు, వెలుతురు తదితరాలు లేకుండా కూడా ఉండగలం గానీ స్వేచ్ఛ లేకుండా మాత్రం ఉండలేం అని జెలెన్‌స్కీ అన్నారు. గతేడాది ఇదే రోజున తాను చక్కగా సూటు వేసుకుని, టై కట్టుకుని ఈ డే రోజున ప్రసంగించాను.
ఈ ఏడాది యుద్ధ సమయంలో మిలటరీ దుస్తులతో ప్రసంగిస్తున్నాను అన్నారు. అప్పటికి ఇప్పటికీ మన ఉక్రెయిన్ నేల చాలా మారిందని, ప్రస్తుతం ల్యాండ్ మైన్‌లు, క్రేటర్స్, యూంటీ ట్యాంకుల వంటివి కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్ని మార్పులు వచ్చినా.. తమ అంతరాళ్లలో ఉన్న లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు, ఎప్పటికీ మారదని దానికోసం ఎన్ని కష్టాలనైనా తట్టుకుని పోరాడుతాం అని దృఢంగా చెప్పారు. ఈ డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ అనేది 2013/2014 నాటి యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనలను సూచిస్తుంది. దీన్ని మైదాన్ విప్లవం ఆఫ్ డిగ్నిటీగా కూడా పిలుస్తారు.
(చదవండి: ఇరాన్‌లో ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్.. కారణమెంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment