స్వేచ్ఛ
ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. శ్రీకాంత్ పెండ్యాల దర్శకుడు. వీపుపై బ్యాగ్ వేసుకుని, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఒక చేత్తో కర్ర పట్టుకుని.. రోజూ స్కూల్‌కి పరుగెత్తుకుంటూ వెళ్లే బాలుడు... జాలరిని చూసి చేపలు ఇమ్మని అడుగుతాడు. వాటిని తీసుకువెళ్లి ఇంట్లో పెంచుతుంటాడు. ఒక రోజు అవి సీసాలో నుంచి కింద పడిపోతాయి. వాటిలో చలనం ఉండదు. వెంటనే ఆ చేపలను చెరువులో వదిలేస్తాడు. వాటికి కూడా స్వేచ్ఛ కావాలని అర్థం చేసుకుంటాడు. పిల్లల హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో, వాళ్లు ఎంత స్వేచ్ఛగా విహరిస్తారో చాలా చక్కగా చూపాడు దర్శకుడు.