
ట్రంప్ విద్వేషానికి ఓటమే: హారిస్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్న విద్వేషాన్ని, విభజనవాదాన్ని అమెరికన్లు ఓడించడం ఖాయమని కమలా హారిస్ ధీమా వెలిబుచ్చారు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిరక్షణకే ఓటేయాలని దేశమంతా పట్టుదలగా ఉంది. నెలల తరబడి దేశవ్యాప్తంగా జరిపిన ప్రచారం భాగంగా నాకిది కొట్టొచ్చినట్టు కన్పించింది’’ అని చెప్పారు.
కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘ఈసారి రెడ్ (రిపబ్లికన్లకు ఓటేసేవి) స్టేట్స్, బ్లూ (డెమొక్రాట్లకు ఓటేసేవి) స్టేట్స్ అంటూ విడిగా లేవు. అన్ని రాష్ట్రాలూ కలిసి చరిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నాయి. మార్పు కోసం అమెరికా యువత ఈసారి భారీ సంఖ్యలో కదం తొక్కుతున్నారు. దేశ మౌలిక విలువల పరిరక్షణకు ముందుకొస్తున్నారు’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment