Realme9 Pro: Series Will Have 5g Phones For Over Rs15000, Deets Inside - Sakshi
Sakshi News home page

Realme9 Pro Series: రూ.15వేలకంటే తక్కువ ధరతో..అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ స్మార్ట్‌ ఫోన్‌!

Published Wed, Jan 19 2022 2:03 PM | Last Updated on Wed, Jan 19 2022 2:31 PM

Realme9 Pro Series Will Have 5g Phones For Over Rs15000 - Sakshi

Realme 9 Pro to launch in India Soon: కొత్త ఏడాది ప్రారంభంతో టెక్‌ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో, తక్కువ బడ్జెట్‌తో  5జీ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి.  

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ రియల్‌ మీ' త్వరలో రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9 ప్రో ప్లస్‌ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్‌ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే ఈ రెండు ఫోన్‌ల ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలు వెలుగులోకి రానప్పటికీ.. లీకైన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్‌లీక్స్ రిపోర్ట్‌ ప్రకారం.. రియల్‌ మీ 9ప్రో 33డబ్ల్యూ  ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో విడుదల కానుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే హోల్ పంచ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్‌, 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో 6.59 అంగుళాల డిస్‌ప్లే,  8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌తో రెండు స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌లు ఉన్నాయి. ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. 

మరోవైపు రియల్‌9 ప్రో ప్లస్‌ ఇలాంటి ఫీచర్లే ఉండగా..ఇందులో 65డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుందని నివేదికల్లో తేలింది. బడ్జెట్ ధరలో కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ అనే రెండు కలర్‌ వేరియంట్లలో లభ్యం కానుంది. జనవరి 22న అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 64బీజీ స్టోరేజ్‌ ఫోన్‌ ప్రారంభ ధర రూ.13,999గా ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement