
సాక్షి, న్యూఢిల్లీ : రంజాన్ పర్వదినం సందర్భంగా షావోమి స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. రెడ్‌మి నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈద్ స్పెషల్‌గా ప్రత్యేకంగా విక్రయిస్తోంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలనుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ మొదలవుతుంది. 48 మెగాపిక్సల్ భారీ కెమెరా, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ప్రధాన ఫీచర్లు. ముందు ప్రకటించిన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్ మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయిందని షావోమి ఇండియా సీఈఓ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు.
రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0 పై
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
13 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ : ధర రూ. 13,999
6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ : ధర రూ. 16,999
Mi fans, here's your Eidi. #RedmiNote7Pro on special sale. Get the amazing #48MPCameraBeast at 4PM from @Flipkart. pic.twitter.com/LSiihtSKxh
— Redmi India (@RedmiIndia) June 5, 2019
Comments
Please login to add a commentAdd a comment