
గెలాక్సీ ఎస్10 శ్రేణి ఫోన్లపై శామ్‌సంగ్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.
హైదరాబాద్: గెలాక్సీ ఎస్10 శ్రేణి ఫోన్లపై శామ్‌సంగ్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. శామ్‌సంగ్ అప్‌గ్రేడ్ ఆఫర్ కింద... కస్టమర్లు గెలాక్సీ ఎస్10ఈ మోడల్‌ను ప్రస్తుత తమ ఫోన్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంతకుముందు రూ.2,000 తగ్గింపు లభించగా, అదిప్పుడు రూ.4,000 అయింది. గెలాక్సీ ఎస్10 (128జీబీ) వేరియంట్‌పై ప్రస్తుత ఎక్సేంజ్ బోనస్ 3,000 సైతం రూ.6,000 అయింది.
గెలాక్సీ ఎస్10ఈ ఫీచర్లు
5.8 అంగుళాల ఫుల్ హెచ్‌సీ స్క్రీన్
ఆండ్రాయిడ్ 9.0 పై
6/8 జీబీ ర్యామ్, 128/256స్టోరేజ్
16 ఎంపీ డ్యుయల్ ఫిక్సెల్ కెమెరా
10 ఎంపీ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరా
3100 ఎంఏహెచ్ బ్యాటరీ