Google Nest Mini Can Be Bought For Re 1 On Flipkart If You Buy Pixel 4a - Sakshi
Sakshi News home page

రూపాయికే గూగుల్‌ నెస్ట్‌ మినీ!

Published Fri, Jun 25 2021 11:42 AM | Last Updated on Sat, Jun 26 2021 12:36 PM

Offer On Google Nest Mini For Re 1 On Flipkart But If You Buy The Pixel 4a - Sakshi

ఫ్లిప్‌ కార్ట్‌ తన వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కేవలం రూపాయికే గూగుల్‌ నెస్ట్‌ మినీని పొందేలా ఆఫర్‌ ఇచ్చింది. వాస్తవానికి గూగుల్‌ నెస్ట్‌ మినీ ధర రూ.2999 ఉండగా .. ఫ్లిప్‌ కార్ట్‌ రూపాయికే అందిస్తుంది. అయితే ఈ రూపాయి ఆఫర్‌ దక్కించుకునేవారికి కొన్ని షరతులు విధించింది.  

ఫ్లిప్‌కార్ట్‌ గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలపై దృష్టిసారించింది. ఈ ఫోన్‌ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ .31,999 ఉండగా.. ఎవరైతే ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తారో.. వాళ్లు అదనంగా రూపాయి చెల్లిస్తే గూగుల్‌ నెస్ట్‌ మినీ స‍్పీకర్‌ ను సొంతం చేసుకోవచ్చు. మినీతో పాటు, ఫ్లిప్‌కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ను ఉపయోగిస్తే పిక్సెల్ 4ఏ పై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పథకం కింద కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ .15,300 చెల్లించి గూగుల్ పిక్సెల్ 4ఏని పొందవచ్చు. చదవండిఅదిరిపోయే ఫీచర్స్‌, త్వరలో మెక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11 విడుదల

స్పెసిఫికేషన్లు  
గూగుల్ పిక్సెల్ 4ఎ 5.81-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, పంచ్ హోల్ ఓఎల్ఇడి డిస్‌ప్లే  9.5: 9  యాస్పెట్‌ రేషియోను కలిగి ఉంది. మిడ్ రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730 జి చిప్‌సెట్‌తో పాటు 6 జీబీ వేరియంట్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ స్కైర్‌ షేప్‌ కెమెరా, 12.2 మెగాపిక్సెల్, డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటెక్షన్, కెమెరా వెనుక ఎఫ్ / 1.7 ఎపర్చరు, ఓఐఎస్  77 డిగ్రీల వీక్షణతో ఉంటుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఎఫ్ / 2.0 ఎపర్చరు, 84-డిగ్రీల ఫైల్డ్‌ వ్యూను వీక్షణ క్షేత్రం ఉంది.

కాగా, భారత్‌లో పిక్సెల్ 4ఏ ను 6 జీబీ వేరియంట్‌ ను రూ. 31,999 రూపాయలకు విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ధర కూడా రూ .25,999 అమ్మకాలు చేపట్టింది గూగుల్‌. అయితే ఇప్పుడు తిరిగి రూ.31,999కే అమ్ముతుంది. దీనిపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వకపోగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ .2999 విలువైన స్పీకర్‌ ను రూపాయికే అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement