జియోనీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ | gionee 'S10 Lite' in India for Rs 15,999 | Sakshi
Sakshi News home page

జియోనీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌

Published Fri, Dec 22 2017 3:44 PM | Last Updated on Fri, Dec 22 2017 3:44 PM

gionee 'S10 Lite' in India for Rs 15,999  - Sakshi

న్యూఢిల్లీ : చైనీస్‌ మొబైల్‌ దిగ్గజం జియోనీ శుక్రవారం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఎస్‌10 లైట్‌ పేరుతో బంగారు, నలుపు రంగుల్లో మొబైళ్లను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.15,999. ఈ మొబైల్‌ శనివారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఎస్‌10 లైట్‌ సెల్ఫీ కెమెరాతో గ్రూప్‌ సెల్ఫీ, బొకె సెల్ఫీలు తీసుకోవచ్చు. వాట్సాప్ క్లోన్‌ ఫీచర్‌లో మూడు అకౌంట్లు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌ ఓఎస్‌తో పని చేసే ఈ మొబైల్‌తో అత్యద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చునని జియోనీ ఇండియా గ్లోబల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ చాంగ్‌ తెలిపారు.

ఫోన్‌ ప్రత్యేకతలు

5.2 అంగుళాల డిస్‌ప్లే
16 ఎంపీ ఫ్లాష్‌ సెల్ఫీ ఫ్రంట్‌ కెమెరా
13 ఎంపీ రియర్‌ ఆటో ఫోకస్‌ కెమెరా
3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎంఎస్‌ఎం8920 ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌
32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ (256 జీబీ దాకా పెంచుకునే సామర్థ్యం)
ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌ ఓఎస్‌(జియోనీ అమిగో 4.0 ఓస్‌)
ఫోన్‌ బరువు 155 గ్రాములు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement