S10
-
శాంసంగ్ మరో అదరిపోయే ఫోన్
సియోల్: ప్రముఖ మొబైల్ తయారీ దారు శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం.గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్లో గెలాక్సీ ఎ 91( ఇంకా లాంచ్ కాలేదు) మాదిరిగానే 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. జీఎస్ఎం ఎరేనా రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్లు ఈ విధంగా ఉండనున్నాయి. శాంసంగ్ ఎస్10 లైట్ ఫీచర్లపై అంచనాలు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 855 8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోనీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : చైనీస్ మొబైల్ దిగ్గజం జియోనీ శుక్రవారం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఎస్10 లైట్ పేరుతో బంగారు, నలుపు రంగుల్లో మొబైళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,999. ఈ మొబైల్ శనివారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఎస్10 లైట్ సెల్ఫీ కెమెరాతో గ్రూప్ సెల్ఫీ, బొకె సెల్ఫీలు తీసుకోవచ్చు. వాట్సాప్ క్లోన్ ఫీచర్లో మూడు అకౌంట్లు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఓఎస్‌తో పని చేసే ఈ మొబైల్‌తో అత్యద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చునని జియోనీ ఇండియా గ్లోబల్ సేల్స్ డైరెక్టర్ డేవిడ్ చాంగ్ తెలిపారు. ఫోన్ ప్రత్యేకతలు 5.2 అంగుళాల డిస్ప్లే 16 ఎంపీ ఫ్లాష్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ ఆటో ఫోకస్ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎంఎస్ఎం8920 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (256 జీబీ దాకా పెంచుకునే సామర్థ్యం) ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఓఎస్(జియోనీ అమిగో 4.0 ఓస్) ఫోన్ బరువు 155 గ్రాములు -
జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎస్10 త్వరలో
న్యూఢిల్లీ: జియోనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. చైనా వెబ్సైట్ టీనా అందించిన సమాచారం 'ఎస్10' ను పేరుతో వచ్చే నెలలో దీన్ని విడుదల చేయనుంది. మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు టీనా రిపోర్ట్ చేసింది. ఎస్ 9 కి సక్సెసర్‌గా దీన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభ్యంకానుందని తెలిపినప్పటికీ ధర వివరాలను మాత్రం వెల్లడి చేయలేదు. గత ఏడాది నవంబర్ జియోని ఎస్ 9 ను విడుదల చేసింది. జియోనీ ఎస్10 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్, 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3700 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఈ వార్తలపై జియోని అధికారికంగా స్పందించలేదు. చైనా, ఇతర ప్రాంతాలో ఈ డివైస్ లభ్యత, స్పెక్స్‌ను ధృవీకరించలేదు. అయితే కానీ టీనామాత్రం లాంచింగ్‌ను నిర్ధారిస్తోంది.