Gionee India
-
జియోనీ రీఎంట్రీ : కొత్త స్మార్ట్ ఫోన్
సాక్షి, ముంబై: చైనా ఉత్పత్తులపై నిషేధించాలన్న డిమాండ్ నేపథ్యంలో పలు స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తిరిగి మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జియోని చేరింది. దాదాపు ఒక సంవత్సరం తరువాత ఈ జియోని బ్రాండ్ జియానీ మాక్స్ స్మార్ట్‌ఫోన్ తో తిరిగొచ్చింది. ప్రధానంగా బిగ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధర వద్ద జియోనీ మాక్స్ లాంచ్ అయింది. బ్లాక్, రెడ్ , రాయల్ బ్లూ మూడు రంగుల్లో లభించనుంది. జియోనీ మాక్స్ ధర, లభ్యత జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్ +32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 5,999 మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యం. జియోనీ మాక్స్ ఫీచర్లు 6.1అంగుళాల హెచ్డీ డిస్ ప్లే 720 x1560 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 ఆక్టా-కోర్ యునిసోక్ 9863ఏసాక్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
ఫ్లిప్‌కార్ట్ సేల్ : బడ్జెట్ ధరలో జియోనీ ఫోన్
సాక్షి, ముంబై: జియోనీ లేటెస్ట్ మొబైల్ తగ్గింపు ధరలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్దివాలీ సేల్‌లో జియోని ఎఫ్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 3వేల రపాయల దాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు 6.26 ఇంచ్ డిస్ప్లే 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 32 ఎంపీ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ : అసలు ధర రూ. 9490 ఆఫర్ ధర రూ.6,999 -
జియోనీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : చైనీస్ మొబైల్ దిగ్గజం జియోనీ శుక్రవారం మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఎస్10 లైట్ పేరుతో బంగారు, నలుపు రంగుల్లో మొబైళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,999. ఈ మొబైల్ శనివారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఎస్10 లైట్ సెల్ఫీ కెమెరాతో గ్రూప్ సెల్ఫీ, బొకె సెల్ఫీలు తీసుకోవచ్చు. వాట్సాప్ క్లోన్ ఫీచర్లో మూడు అకౌంట్లు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఓఎస్‌తో పని చేసే ఈ మొబైల్‌తో అత్యద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చునని జియోనీ ఇండియా గ్లోబల్ సేల్స్ డైరెక్టర్ డేవిడ్ చాంగ్ తెలిపారు. ఫోన్ ప్రత్యేకతలు 5.2 అంగుళాల డిస్ప్లే 16 ఎంపీ ఫ్లాష్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ ఆటో ఫోకస్ కెమెరా 3100 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎంఎస్ఎం8920 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ (256 జీబీ దాకా పెంచుకునే సామర్థ్యం) ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఓఎస్(జియోనీ అమిగో 4.0 ఓస్) ఫోన్ బరువు 155 గ్రాములు -
జియోని ఎం7 పవర్: విత్ సూపర్ పవర్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ బ్యాటరీ సామర్ధ్యంతో మరో చైనా మేడ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మరో భారతీయులను పలకరించబోతోంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈఫోన్ను జియోనీ ‘జియోనీ ఎం7 పవర్’ త్వరలో మన మార్కెట్లోకి వస్తోంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్‌కు మద్దతిచ్చే డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. అంటే వినియోగదారులు రెండు సిమ్ కార్డులు లేదా ఒక సిమ్ కార్డు, ఒక మైక్రో ఎస్డీ కార్డును వినియోగించవచ్చు.. జియోని ఎం7 పవర్ ఆండరాయిడ్ 7.1.1 నౌగాట్ ఆధారిత అమిగో ఆపరేటింగ్ సిస్టమ్ 5.0 తోపనిచేస్తుందట అంతే కాదు స్లోమోషన్, గ్రూప్ సెల్పీ, ట్రాన్స్ లేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ డివైస్ అదనపు ఆకర్షణలు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రూపొందించిన ఈ డివైస్‌ను ఈ నెల 15న విడుదల చేయనుంది. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ప్రమోషన్ ప్రారంభించిన జియోనీ, లాంచింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను మీడియాకు పంపింది. దీని ధర సుమారు రూ. 20 వేలు గా ఉండొచ్చని అంచనా. జియోనీ ఎం7 పవర్ ఫీచర్లు 6 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే 720×1440 పిక్సెల్ రిజల్యూషన్ 1.4 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ (256దాకా విస్తరించుకోవచ్చు) 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ Are you ready? #ComingSoon #MpowerWithGionee pic.twitter.com/B1cBj8McbQ — Gionee India (@GioneeIndia) November 6, 2017 -
జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభాస్
న్యూఢిల్లీ: బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన టాలీవుడ్ హీరో ప్రభాస్.. మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ ఇండియా’కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. కంపెనీ తాజాగా ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోనీ ఇప్పటికే క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ప్రముఖ కథానాయిక శృతిహాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోశాంజ్ వంటి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. తాజా నిర్ణయంతో దేశంలో తమ స్థానం మరింత పదిలమవుతుందని ఆశిస్తున్నాం’ అని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్ ఆర్ వోహ్ర తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదేశ్లలోనే 1.25 కోట్ల మంది యూజర్లను పొందామని పేర్కొన్నారు. -
ప్రభాస్‌తో మొబైల్ కంపెనీ భారీ డీల్
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పించాలని చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మహీంద్ర యాడ్ లో కనిపించిన ప్రభాస్ తరువాత ఒక్క బ్రాండింగ్ కూడా అంగీకరించలేదు. పదిహేను కోట్లకు పైగా ఇస్తామన్న కంపెనీలకు కూడా నో చెప్పాడు ఈ బాహుబలి. దీంతో బాహుబలి తరువాత ప్రభాస్ ఒప్పకోబోయే తొలి బ్రాండ్ ఏంటా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా డార్లింగ్ ఓ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించాడానికి అంగీకరించాడు. చైనా మొబైల్ దిగ్గజం జియోనీకి ప్రస్తుతం బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియ భట్ అంబాసిడర్‌గా ఉంది. అయితే తాజాగా ఈ సంస్థ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ప్రభాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ప్రభాస్‌తో ఓ యాడ్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాడ్ తరువాతే సాహో సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు ప్రభాస్. -
ఇక ఆ మొబైల్‌కు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్
న్యూఢిల్లీ: బాహుబలితో సూపర్‌స్టార్ నటుడిగా ఎదిగిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఓ ప్రముఖ మొబైల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ప్రభాస్ భాగస్వామ్యంతో పనిచేసేందుకు తమ కంపెనీ చాలా ఉత్సాహంతో ఉందంటూ ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్ మేకర్ జియోనీ ఇండియా ప్రకటించింది. ఇక నుంచి ప్రభాస్ తమ మొబైల్ సెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ పనిచేస్తారని జియోని ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ ఆర్ వోరా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జియోనీకి ప్రచారకర్తలుగా టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, అలియాభట్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోసాంజ్ ఉండగా ఇప్పుడు తాజాగా ప్రభాస్ వీరితోపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ‘ ప్రభాస్‌తో కలిసి మేం పనిచేయబోతున్నామని ప్రకటించడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం. సమర్థమంతమైన బ్యాటరీలు, చక్కటి సెల్ఫీలు అనే వాటికి ప్రభాస్‌తో పనిచేసేందుకు మేం సానుకూలంగా ఉన్నాం’ అని ఆయన తెలిపారు.