
సాక్షి, న్యూఢిల్లీ: భారీ బ్యాటరీ సామర్ధ్యంతో మరో చైనా మేడ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మరో భారతీయులను పలకరించబోతోంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈఫోన్‌ను జియోనీ ‘జియోనీ ఎం7 పవర్’ త్వరలో మన మార్కెట్‌లోకి వస్తోంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్‌కు మద్దతిచ్చే డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. అంటే వినియోగదారులు రెండు సిమ్ కార్డులు లేదా ఒక సిమ్ కార్డు, ఒక మైక్రో ఎస్‌డీ కార్డును వినియోగించవచ్చు.. జియోని ఎం7 పవర్ ఆండరాయిడ్ 7.1.1 నౌగాట్ ఆధారిత అమిగో ఆపరేటింగ్ సిస్టమ్ 5.0 తోపనిచేస్తుందట అంతే కాదు స్లోమోషన్, గ్రూప్ సెల్పీ, ట్రాన్స్ లేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ డివైస్ అదనపు ఆకర్షణలు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రూపొందించిన ఈ డివైస్‌ను ఈ నెల 15న విడుదల చేయనుంది. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ప్రమోషన్ ప్రారంభించిన జియోనీ, లాంచింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలను మీడియాకు పంపింది. దీని ధర సుమారు రూ. 20 వేలు గా ఉండొచ్చని అంచనా.
జియోనీ ఎం7 పవర్ ఫీచర్లు
6 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే
720×1440 పిక్సెల్ రిజల్యూషన్
1.4 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్ (256దాకా విస్తరించుకోవచ్చు)
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
Are you ready? #ComingSoon #MpowerWithGionee pic.twitter.com/B1cBj8McbQ
— Gionee India (@GioneeIndia) November 6, 2017