జియోనీ రీఎంట్రీ : కొత్త స్మార్ట్ ఫోన్ | Gionee Max With 5,000mAh Battery launched | Sakshi
Sakshi News home page

జియోనీ రీఎంట్రీ : కొత్త స్మార్ట్ ఫోన్

Published Wed, Aug 26 2020 8:27 AM | Last Updated on Wed, Aug 26 2020 8:35 AM

Gionee Max With 5,000mAh Battery launched - Sakshi

సాక్షి, ముంబై:   చైనా ఉత్పత్తులపై  నిషేధించాలన్న డిమాండ్ నేపథ్యంలో పలు స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తిరిగి మార్కెట్లోకి రీఎంట్రీ  ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జియోని చేరింది.  దాదాపు ఒక సంవత్సరం తరువాత  ఈ  జియోని బ్రాండ్ జియానీ మాక్స్ స్మార్ట్‌ఫోన్ తో  తిరిగొచ్చింది. ప్రధానంగా బిగ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫీచర్లతో ఎంట్రీ లెవల్ ధర వద్ద జియోనీ మాక్స్ లాంచ్ అయింది.  బ్లాక్, రెడ్ , రాయల్ బ్లూ  మూడు రంగుల్లో లభించనుంది.

జియోనీ మాక్స్ ధర, లభ్యత
జియోనీ మాక్స్ 2  జీబీ ర్యామ్ +32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 5,999 మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యం.

జియోనీ మాక్స్  ఫీచర్లు 
6.1అంగుళాల హెచ్‌డీ  డిస్ ప్లే
720 x1560 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10 
ఆక్టా-కోర్ యునిసోక్ 9863ఏసాక్ 
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
2 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement