ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో శాంసంగ్‌  కొత్త స్మార్ట్‌ఫోన్‌ | Samsung Galaxy A9 Pro (2019) with Punch-Hole display, 3-lens Cameras Launched | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేతో శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Published Sat, Jan 26 2019 4:20 PM | Last Updated on Sat, Jan 26 2019 4:23 PM

Samsung Galaxy A9 Pro (2019) with Punch-Hole display, 3-lens Cameras Launched - Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్    అద్భుత ఫీచర్లతో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్కడి మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.  గెలాక్సీ సిరీస్లో భాగంగా గెలాక్సీ ఎ 9 ప్రొ (2019) పేరుతో దీన్ని తీసుకొచ్చింది.  ఇన్‌ఫినిటీ ‘O’ డిస్‌ప్లే’  ( పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే) ఆవిష్కరించిన  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.37,890 గా నిర్ణయించింది.  ఫిబ్ర‌వ‌రి 28వ తేదీనుంచి దక్షిణ కొరియా మార్కెట్లో  విక్రయానికి లభ్యం కానుంది.  మరోవైపు ఇండియాలో లాంచింగ్‌పై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. 

శాంసంగ్ గెలాక్సీ ఎ9 ప్రొ (2019) ఫీచ‌ర్లు
6.4 ఇంచెస్‌ డిస్‌ప్లే
340 x 1080 పిక్స‌ల్స్  రిజ‌ల్యూష‌న్‌
స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
6 జీబీ ర్యామ్, ‌128 జీబీ స్టోరేజ్‌
512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
24+10+5  ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరా 
24 ఎంపీ  సెల్ఫీ కెమెరా 
3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement