Galaxy a 9 Pro
-
ఇన్ఫినిటీ డిస్ప్లేతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అద్భుత ఫీచర్లతో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్కడి మార్కెట్లో లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఎ 9 ప్రొ (2019) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఇన్ఫినిటీ ‘O’ డిస్ప్లే’ ( పంచ్ హోల్ డిస్ప్లే) ఆవిష్కరించిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.37,890 గా నిర్ణయించింది. ఫిబ్రవరి 28వ తేదీనుంచి దక్షిణ కొరియా మార్కెట్లో విక్రయానికి లభ్యం కానుంది. మరోవైపు ఇండియాలో లాంచింగ్‌పై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. శాంసంగ్ గెలాక్సీ ఎ9 ప్రొ (2019) ఫీచర్లు 6.4 ఇంచెస్ డిస్ప్లే 340 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 24+10+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్.. ‘గెలాక్సీ ఏ9 ప్రొ’
ధర రూ.32,490 న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘శాంసంగ్’ తాజాగా ‘గెలాక్సీ ఏ9 ప్రొ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.32,490గా ఉంది. ఇందులో 6 అంగుళాల ఫుల్ హెచ్డీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.