రూ.149లకే అపరిమిత వాయిస్ కాలింగ్: ఆర్కామ్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్’ (ఆర్‌కామ్) తాజాగా కస్టమర్ల కోసం అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. యూజర్లు ఈ ప్లాన్‌ను పొందాలంటే రూ.149లతో రీచార్జ్ చేసుకోవాలి. తాజా ప్లాన్‌లో 2జీ/3జీ/4జీ యూజర్లు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అరుునా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
దేశంలోని అధిక సంఖ్యాక 2జీ యూజర్లను తమ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను ఆవిష్కరించామని వివరించింది. ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో యూజర్లు అదనంగా 300 ఎంబీ డేటాను పొందొచ్చని పేర్కొంది. జియో కూడా ఉచిత కాల్స్‌ను అందిస్తోంది కదా అంటే ఆ సౌలభ్యం కేవలం వీఓఎల్‌టీఈ సపోర్ట్ 4జీ హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి.