ఎయిర్‌టెల్ రూ.9 రీఛార్జ్ ప్యాక్ (ఫైల్ ఫోటో)
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకు పోటీగా మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే ఎంట్రీ-లెవల్ 9 రూపాయల రీఛార్జ్ ప్యాక్. ఈ కొత్త స్కీమ్ కింద అపరిమిత వాయిస్ కాల్స్‌ను, డేటాను, ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులకు అందించనున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది.
ఎయిర్‌టెల్ రూ.9 ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే వాలిడిటీలో ఉండనుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్‌తో పాటు అదనంగా రోజులో 100 ఎస్‌ఎంఎస్‌లను, 100 ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. రిలయన్స్ జియో రూ.19 ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్‌ను తీసుకొచ్చింది.
జియో ఆఫర్ చేస్తున్న రూ.19 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, 20 ఎస్‌ఎంఎస్‌లు, 150ఎంబీ డేటాను మాత్రమే వినియోగదారులు పొందుతున్నారు. ధర పరంగా, ఆఫర్ల పరంగా చూసుకుంటే జియో కంటే ఎయిర్‌టెలే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.23 ప్లాన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 200 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను రెండు రోజుల పాటు ఆఫర్ చేస్తోంది.
కంపెనీ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు ఈ రూ.9 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోంబో ఆఫర్ సెక్షన్ కింద ఈ రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంది. నెల రోజుల పాటు ఇలాంటి ప్రయోజనాలు పొందాలనుకునే వారికి కూడా ఎయిర్‌టెల్ రూ.98 ప్యాక్‌ను ఇటీవల లాంచ్ చేసింది. దీని కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్‌పై ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను కస్టమర్లకు ఎయిర్‌టెల్ 28 రోజుల పాటు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment