రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతున్నకొద్దీ కస్టమర్‌లు టెన్షన్ పడుతూ ఉంటారు. అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌లు రీచార్జ్ చేసుకుందామంటే ధర ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్‌లను పరిచయం చేస్తోంది.
ప్రైవేట్ టెలికాం సంస్థలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్‌ల కోసం అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. లక్షల మంది వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్‌లను చేర్చింది. తాజాగా 105 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.
105 రోజుల వ్యాలిడిటీ ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్ తమ వినియోగదారులకు అధిక వ్యాలిడిటీని అందిస్తూ రూ. 666 ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 105 రోజుల పాటు ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత కాలింగ్ ఉంటుంది. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా చెల్లుబాటు వ్యవధికి మొత్తం 210 జీబీ డేటాను అందిస్తోంది. అంటే రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటాకు సమానం. ఈ ధరతో ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీల్లో విస్తృతమైన వ్యాలిడిటీ ప్లాన్‌లు లేవు.
Comments
Please login to add a commentAdd a comment