
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది. ముఖ్యంగా జియో ప్యాక్‌కు దీటుగా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ సరికొత్త ప్లాన్‌నులాంచ్ చేసింది. 24 గంటల వాలిడిటితో రూ.21లకు గంటకు అన్‌లిమిటెడ్ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు వోడాఫోన్ ఒక "సూపర్ అవర్" రీఛార్జ్ ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో కస్టమర్ కేవలం 16 రూపాయలు రీఛార్జ్‌పై అపరిమిత డేటాను పొందవచ్చు.
కాగా రిలయన్స్ జియో 19 రూపాయలకే ఒక రోజు వ్యాలిడిటీతో 150 ఎంజీ 4జీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు .అంతేకాదు 20 లోకల్ ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వినియోగించుకోవచ్చు.