
సాక్షి, ముంబై: దేశీయ టెలికాంరంగంలో జియో ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్‌టెల్, ఐడియా లాంటి కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు వస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ కూడా ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఎయిర్‌టెల్, జియో లాంటి ప్లాన్ల తరహాలోనే కేవలం రూ. 9ల కే ఒక రీచార్జ్ ప్లాన్‌ను శుక్రవారం వెల్లడించింది. ఇందులో వొడాఫోన్ ప్రీపెయిడ్ చందాదారులు రోజుకు అపరిమిత స్థానిక , ఎస్టీడీ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, 100ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే కొత్త ప్యాక్ ప్రత్యేకంగా యుపి ఈస్ట్ లో వోడాఫోన్ చందాదారుల కోసం ఈప్లాన్‌ను తీసుకొచ్చింది.
అయితే తాజా రూ. 9 వొడాఫోన్ ప్యాక్‌ను కేవలం యూపీకే పరిమితం చేయగా.. మరోవైపు 9 రూపాయల ప్యాక్‌లో ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా రోజుకు అన్‌లిమిటెడ్ కాలింగ్ 100ఎస్‌ఎంఎస్‌లు, 100ఎంబీ డేటాను అందిస్తోంది. జియో రూ. 19 రోజువారీ ప్యాక్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, 20 ఎస్ఎంఎస్లు, 150 ఎంబీ డేటాను ఆఫర చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వోడాఫోన్ కూడా ఈ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా కూడా అమలు చేసే అవకాశం ఉందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment