ఆ ఫోన్ల ధరలు ఢమాల్..!
లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల ధరలు పడిపోయాయి. లైఫ్ బ్రాండెడ్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్టు రిలయెన్స్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ కొత్త ధరలు అమలు చేయాలని డీలర్లకు రిలయెన్స్ కంపెనీ తెలిపింది.
లైఫ్ స్మార్ట్ ఫోన్ల కొత్త ధరలు...
లైఫ్ వాటర్ 2.. కొత్త ధర రూ.9,499 (రూ.4వేల తగ్గింపు)
లైఫ్ విండ్ 6.... కొత్త ధర రూ.5,999 (రూ.500 తగ్గింపు)
లైఫ్ ఫ్లేమ్ 2.... కొత్త ధర రూ. 3,499 (రూ. 1,300 తగ్గింపు)
లైఫ్ ఫ్లేమ్ 4, ఫ్లే 5, ఫ్లే 6 హ్యాండ్ సెట్లపై కూడా రూ.1,000 ధర తగ్గించింది. దీంతో ఈ మూడు ఫోన్లు రూ.2,999కే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు అన్ని లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు రిలయెన్స్ జియో నెట్ వర్క్ పై మూడు నెలల పాటు ఫ్రీ అన్ లిమిటెడ్ 4జీ డేటా, వాయిస్ కాలింగ్ ఆఫర్ చేయనున్నట్టు రిలయెన్స్ ప్రకటించింది. దీంతో రూ.2,999కే మూడు నెలల వాయిస్ కాలింగ్, అన్ లిమిడెట్ 4జీ డేటాను వినియోగదారులు పొందబోతున్నట్టు కంపెనీ తెలిపింది.
అయితే రిలయెన్స్ జియో 4జీ సర్వీసులు అధికారికంగా ఇంకా ఆవిష్కరించలేదు. కేవలం ఉద్యోగుల రిఫరల్ ప్రోగ్రామ్ కింద ఈ సర్వీసులను వినియోగదారులకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. రిలయెన్స్ సీడీఎమ్ఏ కస్టమర్లు రిలయెన్స్ జియో సిమ్ లపై అప్ గ్రేడ్ అయ్యేలా కంపెనీ ఆఫర్ చేస్తోంది. లైఫ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ జియో సిమ్ లను కంపెనీ అందుబాటులో ఉంచుతోంది.