'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది' అంటూ దేశీయ టెలికాం దిగ్గజాలు యూజర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే జియో' బ్రాండ్ బ్యాండ్ తన వినియోగదారులకు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది. తాజాగా టెలికాం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ఐడియాకు పోటీగా కొన్నిప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా'లు ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచాయి.ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్ని అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఆయా కంపెనీల యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ప్రత్యేకంగా డిస్కౌంట్‌లను ప్రకటించాయి. ముఖ్యంగా యాప్ ద్వారా రీఛార్జ్ చేయించుకునే వినియోగదారులు కొంతమేర డబ్బును ఆదా చేసుకోవచ్చని టెలికాం కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా చాలా మంది వినియోగదారులు అపరిమిత కాల్‌లు, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను పొందవచ్చు. 2జీబీ రోజువారీ డేటా, నెలవారీ, వార్షిక ప్లాన్‌లు ధరల పరంగా విభిన్నంగా ఉన్నాయి. ముందుగా
ఎయిర్ టెల్ 2జీబీ నెలవారీ ప్లాన్‌లు vs వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో పాటు.. ఈ నాలుగు ప్లాన్‌లకు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.359, రూ.549, రూ.839, రూ.2999 ఉన్నాయి. ఇక యాప్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.309కే వస్తుంది. దీంతో రూ.50 ఆదా అవుతుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అపరిమిత కాల్‌లను పొందవచ్చు. రోజువారీ డేటా ఎక్కువ పొందితే..వాటిపై ధరలు తక్కువగా ఉంటున్నాయి. ప్లాన్‌ల ధరలు పెరిగే కొద్ది ప్రయోజనాలు పెరుగుతున్నాయి.
►ఉదాహరణకు వినియోగదారులు సంవత్సరానికి ప్రతి నెల రూ.359 చెల్లిస్తున్నట్లయితే ఆమొత్తం రూ.4308 అవుతుంది. కానీ నేరుగా వార్షిక ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ అయినప్పుడు ధర రూ.2999 అవుతుంది. దీని వల్ల వినియోగదారులకు రూ.1309 ఆదా చేసుకోవచ్చు.
►అలాగే వినియోగదారులు రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసినప్పుడు నెలకు రూ. 250 ఖర్చవుతుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లో రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ ప్యాక్ తో నెలకు ఖర్చు రూ.200 లోపు అవుతుందని ప్రచారం చేస్తుంది.
జియో నెలకు 2జీబీ vs వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు
►జియో 28రోజుల వ్యాలిడిటీతో రూ.299ప్లాన్‌లో భాగంగా 2జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు,రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.
►రూ.533 ప్లాన్‌లో భాగంగా 56 రోజుల వాలిడిటీతో అందిస్తుంది.
►84రోజుల వ్యాలిడిటీతో రూ.719 ప్లాన్‌ను అందిస్తుంది
►చివరిగా వార్షిక ప్లాన్ కింద రూ.2879తో సూపర్ వాల్యూ ప్లాన్‌ను అందిస్తుంది. మొత్తం డేటా ప్రయోజనాలు నెలవారీ ప్లాన్ కంటే ఎక్కువ, ప్లాన్ మొత్తం సంవత్సరం పాటు కొనసాగుతుంది.
వొడాఫోన్ ఐడియా నెలకు 2జీబీ vs త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు
వొడాఫోన్ ఐడియా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.359, రూ.539, రూ.839. అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్,రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. వార్షిక ప్లాన్ లేదా 84 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ రూ.279కి తగ్గింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 2జీబీ రోజువారీ డేటాను అందించే వార్షిక ప్లాన్‌లను అందించడం లేదు. అయితే, ఇది రూ.2899 ధరతో 1.5GB రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది.
ఎక్కువ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం వల్ల యూజర్లకు డబ్బు ఆదా అవుతుంది. వార్షిక ప్లాన్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసినట్లయితే, వారు పూర్తి సంవత్సరం వ్యాలిడిటీతో పాటు అదే డేటా, కాలింగ్ ప్రయోజనాలను పొందుతారని పై ప్లాన్‌లు చూపుతున్నాయి.
చదవండి: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సేవలను ఉచితంగా ఇలా పొందండి..!
Comments
Please login to add a commentAdd a comment