ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్‌ఎఫ్‌టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)కు భారీ ఆదరణ లభిస్తోంది. సినీ తారల నుంచి మొదలుకొని అగ్ర కంపెనీల వరకు ప్రత్యేకంగా ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ నెట్ వర్క్ దిగ్గజం వొడాఫోన్ ఎన్‌ఎఫ్‌టీ తీసుకొని వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా 1992 డిసెంబరు 3న పంపిన "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వొడాఫోన్ వేలానికి ఉంచింది. పారిస్ ఆక్షన్ హౌస్‌లో 'నాన్ ఫంజిబుల్ టోకెన్స్'గా ఈ వారం ప్రారంభంలో ప్రపంచంలోని మొట్టమొదటి టెక్స్ట్ సందేశాన్ని 121,000 డాలర్ల(సుమారు రూ.90 లక్షలు)కు వొడాఫోన్ విక్రయించింది.
30 ఏళ్ల క్రితం(డిసెంబర్ 3, 1992న) వొడాఫోన్ కంపెనీలో ఎస్‌ఎంఎస్ కమ్యూనికేషన్‌పై పనిచేసిన ఇంజినీర్ నీల్ పాప్‌వర్త్ తన మొదటి టెస్టింగ్ ఎస్‌ఎంఎస్ 'మెర్రీ క్రిస్మస్' సందేశాన్ని రిచార్డ్ జార్విస్(బిజినెస్‌మ్యాన్)కు పంపించారు. అతను తన 2 కిలోల ఆర్బిటెల్ పరికరంలో ఈ సందేశాన్ని అందుకున్నాడు. ఈ ఆర్బిటెల్ పరికరం డెస్క్ ఫోన్ తరహాలోనే ఉంటుంది. ఈ "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ- యుఎన్‌హెచ్‌సిఆర్‌కు యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజికి విరాళంగా అందిస్తారు. ఈ వేలం తర్వాత ప్రపంచంలోని మొదటి ఎస్‌ఎంఎస్‌కు సంబంధించి ఎటువంటి ఎన్‌ఎఫ్‌టీని లేదా కాయిన్‌ను ఇష్యూ చేయబోమని వొడాఫోన్ ప్రకటించింది.
(చదవండి: భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! నాసా హెచ్చరిక)
Comments
Please login to add a commentAdd a comment