నగదు కొరతతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టంచేసింది. వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బుధవారం లోక్‌సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తమ శాఖ వద్ద అలాంటి ఏ ప్రతిపాదన లేదని తెలిపారు. అయితే కంపెనీని ఆర్థికంగా ఆదుకునేందుకు మాత్రమే ఆ వాటాను తీసుకున్నామనీ స్పష్టం చేశారు.
మేజర్ వాటా కేంద్రానిదే..
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.1 శాతం వాటా ఉంది. ఆ కంపెనీ టెలికం శాఖకు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ షేర్లుగా మార్చుకుంది. దీంతో ప్రభుత్వానికి ఆ వాటా సమకూరింది. ఇప్పుడు కంపెనీలో అతిపెద్ద వాటాదారు కేంద్ర ప్రభుత్వమే. భాగస్వామ్య సంస్థ బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌కు 32.3 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 18.1 శాతం..రెండింటికీ కలిపి 50.4 శాతం వాటా ఉన్నది. మిగిలిన వాటా రిటైల్ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. వొడాఫోన్ చెల్లించాల్సిన మరో రూ.40,000 కోట్లకు నాలుగేళ్లపాటు మారటోరియం ఉంది. అయితే ఈ మొత్తాన్ని 2026 నుంచి కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బకాయిల్ని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుని వాటాను 70 శాతానికి పెంచుకుంటుందన్న అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: భారత్ ప్రధాన సమస్య ఏమిటంటే..?
ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎన్‌ఎన్‌ఎల్)పై అడిగిన ప్రశ్నకు చౌహాన్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 4జీ సేవలను ప్రారంభించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన 1,00,000 సైట్‌ల కోసం కొనుగోలు ప్రణాళికలు చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment