న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వల్ల అన్నింటికంటే ఐడియా– వొడాఫోన్ విలీన కంపెనీకే అధిక ప్రయోజనం అందిస్తుందని డాయిష్ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. వేలంలో స్పెక్ట్రమ్‌ను పొందిన టెలికం కంపెనీలు చెల్లింపులకు మరింత గడువునివ్వడం, స్పెక్ట్రమ్ పరిమితులను సడలించడం, తదితర అనుకూల నిర్ణయాలతో కూడిన రిలీఫ్ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. స్పెక్ట్రమ్ చెల్లింపుల కాలాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల కాలం నుంచి పదహారేళ్లకు పొడిగించడం వల్ల వొడాఫోన్–ఐడియా విలీన కంపెనీకి బాగా ప్రయోజనం కలుగుతుందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది.
ఈ విలీన కంపెనీకి స్పెక్ట్రమ్ వార్షిక ఇన్‌స్టాల్‌మెంట్ 30 శాతం మేర తగ్గుతుందని తెలిపింది. అంతేకాకుండా స్పెక్ట్రమ్ పరిమితులను పెంచడం కూడా ఈ విలీన కంపెనీకి ప్రయోజనకరమని పేర్కొంది. మరోవైపు స్పెక్ట్రమ్ చెల్లింపులకు మరింత గడువునివ్వడం వల్ల టెలికం కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లోస్‌కు ఒకింత ఊరటనిస్తుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. స్పెక్ట్రమ్ పరిమితిని పెంచడంవల్ల విలీనాలకు ఊతం లభిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ వివరించింది.
వొడాఫోన్, ఐడియాలకు లాభం
Published Fri, Mar 9 2018 5:50 AM | Last Updated on Fri, Mar 9 2018 5:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment