
టెలికాం దిగ్గజాలు పండుగ సీజన్‌ను ప్రారంభించాయి. ఆఫర్లు, టారిఫ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వొడాఫోన్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద వొడాఫోన్ యూజర్లు కేవలం రూ.399కే ఆరు నెలల పాటు 90జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందనున్నారు. రిలయన్స్, ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌కు కౌంటర్‌గా వొడాఫోన్ ఈ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే. అంతేకాక కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమేనని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు కూడా వొడాఫోన్ 2జీ సర్కిళ్లు మాత్రమే. దివాళి గిఫ్ట్‌గా తన కస్టమర్లకు వొడాఫోన్ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
జియో ఆఫర్ చేసే రూ.399 ప్లాన్ కింద 84 రోజుల పాటు 84జీబీ 4జీ డేటా, అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ పొందనున్నారు. అదేవిధంగా ఎయిర్‌టెల్ ఆఫర్ చేసే రూ.399 ప్లాన్ కింద కూడా అదే రకమైన ప్రయోజనాలను తమ కస్టమర్లు పొందుతున్నారు. జియో తన కస్టమర్లకు దివాళి ఆఫర్ ప్రకటించగానే వొడాఫోన్ కూడా ఈ ప్లాన్‌ను ప్రకటించింది. జియో ప్రకటించిన దివాళి ఆఫర్‌లో రూ.399 రీఛార్జ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందనున్నారు.