
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికం శాఖను (డాట్) కోరాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టెల్కోలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం ఫీజులు కట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 21,000 కోట్లు కట్టాల్సి రానుంది.