అత్యధిక నష్టాలొచ్చిన భారత కంపెనీగా.. | Vodafone Idea Posts Rs 73,878 Crore Loss In Last Season | Sakshi

ఐడియా నష్టాలు రూ.73,878 కోట్లు

Jul 2 2020 1:03 PM | Updated on Jul 2 2020 1:07 PM

Vodafone Idea Posts Rs 73,878 Crore Loss In Last Season - Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాకు గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.73,878 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి నష్టాలు ఇప్పటివరకూ ఏ భారత కంపెనీకి రాలేదు. ఏజీఆర్‌ (సవరించిన స్థూల రాబడి) సంబంధిత బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయి నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19)లో నికర నష్టాలు రూ.14,604 కోట్లుగా ఉన్నాయి.  ఆదాయం రూ.37,093 కోట్ల నుంచి రూ.44,958 కోట్లకు పెరిగింది. (హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!)

∙గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.4,882 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత క్యూ4లో రూ.11,644 కోట్లకు ఎగిశాయి. గత క్యూ3లో నష్టాలు రూ.6,439 కోట్లుగా ఉన్నాయి.  

∙గత క్యూ4లో ఆదాయం రూ.11,754 కోట్లు. సీక్వెన్షియల్‌గా కార్యకలాపాల ఆదాయం 6 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది డిసెంబర్‌ నుంచి టారిఫ్‌లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది.  
∙గత క్యూ3లో రూ.109గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి(ఏఆర్‌పీయూ) గత క్యూ4లో రూ.121కు పెరిగింది. ఇదే కాలంలో వినియోగదారుల సంఖ్య 30.4 కోట్ల నుంచి 29.1 కోట్లకు తగ్గింది.  
∙ఐడియా సెల్యులర్‌లో వొడాఫోన్‌ ఇండియా 2018, ఆగస్టులో విలీనమైంది. అందుకని అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో గత ఆర్థిక సంవత్సరం ఫలితాలను పోల్చడానికి లేదు.  
∙కంపెనీ రూ.51,400 కోట్ల మేర ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలి. మొత్తం రూ.58,254 కోట్ల బకాయిల్లో రూ.6,854 కోట్లు చెల్లింపులు జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement