
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్‌తో టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు చేతులు కలిపాయి. శాంసంగ్‌తో జతకట్టి, ఎంపకిచేసిన గెలాక్సీ జే-సిరీస్ డివైజ్‌లపై రెండేళ్ల కాలంలో రూ.1500 విలువైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించాయి. రూ.6,990 మధ్య నుంచి రూ19,900 ధరల శ్రేణిలో ఉన్న గెలాక్సీ జే2 (2017), గెలాక్సీ జే5 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే7 ప్రో మోడళ్లపై ఎయిర్‌టెల్ ఆఫర్లు ప్రకటించగా... రూ.8,490 నుంచి రూ.16,900 మధ్యలో ధర కల్గిన గెలాక్సీ జే2 ప్రో, గెలాక్సీ జే7 నెక్స్ట్, గెలాక్సీ జే7 మోడళ్లపై క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వొడాఫోన్ తెలిపింది.
శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్ వినియోగదారులు.. రూ.199తో ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే.. దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్, రోజుకు 1 జీబీ డేటా పొందుతారు. మొత్తంగా రెండేళ్లలో ఎయిర్‌టెల్ ఖాతాదారులు రూ.5,000తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వొడాఫోన్ ఖాతాదారులు ప్రతినెలా రూ.198తో (రెండేళ్లలో మొత్తంగా రూ.4,752) రీఛార్జి చేసుకుంటే పూర్తి క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొందుతారు.
''24 నెలల్లో రెండేళ్ల కాలవ్యవధిలో రూ.1,500 క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందుతారు. ఏడాది ముగిసేసరికి.. వినియోగదారులు ఏ రీఛార్జి చేసుకున్నా మొత్తం విలువ రూ.2,500కు సమానం కావాలి. దీంతో రూ.300 క్యాష్‌బ్యాంక్‌కు అర్హత సాధిస్తారు. ఇక రెండో ఏడాదీ మరో రూ.2,500 సమానమైన రీఛార్జి చేసుకుంటే రెండో విడతగా రూ.1200 క్యాష్‌బ్యాక్‌ను పొందగలరు'' అని ఎయిర్‌టెల్ వివరించింది. అర్హులైన ఖాతాదారుకు చెందిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఈ నగదును జమ చేస్తుందని, పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులకు సైతం వొడాఫోన్ ఈ సదుపాయాన్ని అందిస్తోందని తెలిసింది. వొడాఫోన్ కూడా ఏడాది తర్వాత రూ.600, రెండో ఏడాది తర్వాత రూ.900 క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్ల ఎం-పెసా వాలెట్లలో జమచేయనుంది.