
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ ‘వొడాఫోన్ ఇండియా’ జనవరిలో వీవోఎల్‌టీఈ 4జీ సర్వీసులను ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ‘వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (వీవోఎల్‌టీఈ) సేవల ప్రారంభమనేది కీలకమైన చర్య. దీని ద్వారా డేటా నెట్‌వర్క్ బలోపేతమౌతుంది. కస్టమర్లు మెరుగైన సర్వీసులు పొందొచ్చు.
హెచ్‌డీ క్వాలిటీ కాలింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని వొడాఫోన్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ సూద్ తెలిపారు. వీవోఎల్‌టీఈ సర్వీసులను తొలిసారిగా ముంబై, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, కోల్‌కతా ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారాయన. తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలియజేశారు.