ప్రస్తుత పరిస్థితుల్లో వోడాఫోన్ ఐడియా షేరును కొనవద్దని ఎంఎస్‌ఎల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సలహానిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా నగదు ప్రవాహ ఒత్తిళ్లను ఎదుర్కోంటుందని, కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీవ్ర రుణాభారాన్ని కలిగి ఉందన్నారు. త్రైమాసిక నగదు ప్రవాహం సజావుగా కొనసాగాలంటే ఏఆర్‌పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) ఛార్జీలను కనీసం 40-50శాతం పెంచాల్సి ఉంటుందని ఖేమ్కా అన్నారు. ఇదే పరిస్థితుల్లో ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ కేవలం 15-20శాతం ఏఆర్‌పీయూ పెంచినా వారికి వ్యాపారాభివృద్ధికి మేలు చేసే అంశమవుతుందని ఖేమ్కా చెప్పుకొచ్చారు.
ఇటీవల టెలికాం రంగం నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నట్లు ఖేమ్కా తెలిపారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో వరుసగా వాటాలు విక్రయించడంతో పాటు మరికొంత వాటాను అమ్మేందుకు సిద్ధంగా ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను టెలికాం రంగం వైపు దృష్టి మళ్లించేలా చేశాయన్నారు. ఇక భారతీ ఎయిర్‌టెల్ విషయానికొస్తే.., ఇటీవల ఏఆర్‌పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)గణీయంగా మెరుగపడటాన్ని ఖేమా గుర్తు చేశారు.
నిరాధరమైన వార్తల ఆధారంగా మాత్రమే వోడాఫోన్ షేరు ఇటీవల మూమెంట్‌ను కనబరుస్తుందని, ఈ సమయంలో వోడాఫోన్‌కు దూరంగా ఉండటం మంచిదని ఆయన సలహానిస్తున్నారు. అయితే ఇదే రంగంలో భారతీ ఎయిర్‌టెల్ షేరు కొనుగోలు చేయడం మంచిదని ఖేమా చెప్పుకొచ్చారు.
వొడాఐడియాలో దాదాపు 5 శాతం వాటా కొనేందుకు గూగుల్ సిద్ధంగా ఉందనే వార్తలు వెలుగులోకి రావడంతో శుక్రవారం ఒకదశలో షేరు దాదాపు 35శాతం లాభపడి రూ.7.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే తమ కంపెనీలో గూగుల్ పెట్టుబడులు పెడుతున్న ప్రతిపాదన తమ పరిశీలనలోకి రాలేదనే వొడాఫోన్ ఐడియా తెలిపడంతో షేరు మార్కెట్ ముగిసే సరికి 12.71శాతం లాభంతో రూ.6.56 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment