విద్యార్థులకు వొడాఫోన్ బంపర్ ఆఫర్
విద్యార్థులకు వొడాఫోన్ బంపర్ ఆఫర్
Published Tue, Aug 1 2017 8:40 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM
టెలికాం కంపెనీలను ముప్పుతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియోకి కౌంటర్ ఇచ్చేందుకు వొడాఫోన్ సిద్ధమైంది. విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని ఒ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను 84 రోజుల పాటు వాడుకునే సదుపాయాన్ని అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ జియో కూడా ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఇలాంటి ప్రయోజనాలనే ఆఫర్ చేస్తోంది. రూ.399 రీఛార్జ్‌తో ఉచిత రోమింగ్, అపరిమిత ఎస్‌ఎంఎస్‌ను ఇది కల్పిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ విద్యార్థులకు ప్రకటించిన 'వొడాఫోన్ క్యాంపస్ సర్వైవల్ కిట్' స్కీమ్ కింద రూ.445 రీఛార్జ్‌పై అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను 84 రోజుల పాటు అందించనుంది. అంతేకాక డిస్కౌంట్ కూపన్లను, మెసెంజర్ బ్యాగ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అయితే ఇది కేవలం కొత్త కనెక్షన్ తీసుకున్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంత విద్యార్థులకు మాత్రమే. రూ.445 అనంతరం రూ.352తో తదుపరి రీఛార్జ్‌లకు కూడా ఇదే రకమైన ప్రయోజనాలను అందించనున్నామని వొడాఫోన్ తెలిపింది.
రూ.445 సర్వైవల్ కిట్‌లోనే ఓలా, జోమాటో నుంచి డిస్కౌంట్ బుక్‌లెట్లు ఉంటాయి. ఈ విషయాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని విద్యార్థులందరికీ వొడాఫోన్ ఇండియా ఢిల్లీ సర్కిల్ బిజినెస్ హెడ్ అలోక్ వెర్మ ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ఈ స్కీమ్‌ను దేశమంతటా దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. అయితే సర్కిల్ సర్కిల్‌కు రీఛార్జ్ విలువ భిన్నంగా ఉంటుందని కన్స్జూమర్ మార్కెటింగ్ వొడాఫోన్ ఇండియా నేషనల్ హెడ్ అరవింద్ నివేటియా పేర్కొన్నారు. ప్రస్తుతం వొడాఫోన్ ఢిల్లీ-ఎన్సీఆర్‌లో రూ.349 రీఛార్జ్‌పై 84 రోజుల పాటు వారానికి 1200 నిమిషాలు, రోజుకు 300 నిమిషాలు చొప్పున కాలింగ్ సదుపాయాలను, రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ.349 ఆఫర్ ముగుస్తుందని, కస్టమర్లు సర్వైవల్ కిట్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చని అరవింద్ తెలిపారు. ఇది కూడా 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు.
Advertisement
Advertisement