డబుల్ స్పీడులో జియో
డబుల్ స్పీడులో జియో
Published Fri, Apr 21 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
సంచలనమైన ఆఫర్లతోనే కాకుండా.. ప్రత్యర్థుల కంటే డబుల్ స్పీడులో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్గా నిలిచింది. జియో సగటు డౌన్లోడ్ స్పీడు 16.48ఎంబీపీఎస్గా నమోదైంది. ఈ స్పీడు ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువని టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. మే నెలలో జియో సెకనుకు 16.48 మెగాబిట్ సగటు డౌన్లోడ్ స్పీడును అందించినట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. దీని తర్వాత ఐడియా 8.33ఎంబీపీఎస్ ఇచ్చిందట. టెలికాం దిగ్గజంగా పేరున్న భారతీ ఎయిర్ టెల్ స్పీడడ్ 7.66 ఎంబీపీఎస్ అని వెల్లడైంది.
జియో ప్రస్తుతమందిస్తున్న ఈ 16ఎంబీపీఎస్ స్పీడులో యూజర్లు ఒక బాలీవుడ్ సినిమాను 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశముంటుందని తెలిసింది. అదేవిధంగా టెలికాం మార్కెట్లో ఉన్న మిగతా కంపెనీలు వొడాఫోన్ 5.66 ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ 2.64ఎంబీపీఎస్, టాటా డొకొమో 2.52ఎంబీపీఎస్,ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2.26ఎంబీపీఎస్, ఎయిర్ సెల్ 2.01 డౌన్ లోడ్ స్పీడును అందిస్తున్నట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడును ట్రాయ్ గణిస్తుంది.
Advertisement