మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా కుట్రలు పన్నిన మూడు టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలకు 3050 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
టెల్కోలపై ఫైన్.. పరిశీలించనున్న ప్రభుత్వం
Published Thu, May 25 2017 6:14 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా కుట్రలు పన్నిన మూడు టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలకు 3050 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ జరిమానాను ప్రతిపాదించింది. అయితే ట్రాయ్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించనుందని కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే పరిశీలన చేపడతామని సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సిన్హా తెలిపారు. టెల్కోలకు విధించిన శిక్ష సరియైనదేనని, పెద్ద ఎత్తున్న ప్రజల ప్రయోజనాలు దీనిలో భాగమై ఉన్నాయని ట్రాయ్ పేర్కొంది.
దీనికి సంబంధించి టెలికాం డిపార్ట్ మెంట్ కు రెగ్యులేటరీ బుధవారం ఓ లేఖను రాసింది. లైసెన్సు సర్వీసు ఏరియాలను ఆధారంగా చేసుకుని తాము ఈ పెనాల్టీలను విధించామని ట్రాయ్, డీఓటీకి చెప్పింది. ఎయిర్ టెల్ కు 1,050 కోట్లు, వొడాఫోన్, ఐడియాలకు రూ.950 కోట్లు జరిమానాలు విధించినట్టు పేర్కొంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా టెలికాం దిగ్గజాలు కుట్రపన్నుతున్నాయని వీటికి అక్టోబర్ లోనే ఈ మేర జరిమానాను ట్రాయ్ విధించింది. అవసరమైన పోల్ ఇవ్వకపోవడం లైసెన్సు నిబంధనలు ఉల్లంఘించడమేనని టెలికాం రెగ్యులేటరీ పేర్కొంది.
Advertisement
Advertisement