Sinha
-
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఈమే..
ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌కు అత్యంత ఆదరణ తీసుకొచ్చింది బిగ్‌బిలియన్ డేస్ సేల్. ఇది దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్. ఈ సేల్ నిర్వహించినప్పుడు కొనుగోళ్లు విపరీతంగా ఉంటాయి. కారణం ఈ సమయంలో లభించే ఆఫర్లు. అయితే ఈ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఎవరో తెలుసా? మింత్రా దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మార్కెట్ ప్లేస్‌లలో ఒకటి. వాల్-మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ ఒక సూపర్ ఉమన్ సీఈవోగా ఉన్నారు. ఆమే నందితా సిన్హా. అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. నందితా సిన్హా 2022 జనవరి 1న మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ రంగాలలో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె బ్రిటానియా లో కూడా పనిచేశారు. సమ్మర్ ట్రైనీగా ప్రారంభించి 2009లో కస్టమర్ మేనేజర్‌గా నిష్క్రమించారు. ఐదేళ్లపాటు హెచ్‌యూఎల్‌లో కొనసాగారు. బ్రిటానియాలో ఆమె ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. మీడియా ప్లానింగ్, కమ్యూనికేషన్‌కు బాధ్యత వహించారు. ఆ తరువాత ఆమె మైబేబీకార్ట్ (MyBabyCart.com) అనే ఈ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. నందితా సిన్హా 2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. ఆ తర్వాత ఆ కంపెనీ మింత్రాను కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లింది. నందితా సిన్హా ఎనిమిదేళ్లకుపైగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె కస్టమర్ల ఆకర్షణ, గ్రోత్ ఫంక్షన్‌కు నాయకత్వం వహించారు. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఆమె పాత్ర కీలకమైనది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నడిపించింది ఈమే. మింత్రా సీఈవో కావడానికి ముందు నందితా సిన్హా కస్టమర్ గ్రోత్, మీడియా, ఎంగేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. లక్నోకు చెందిన ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారనాసీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) నుంచి బీటెక్ చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎఫ్ఎంఎస్) నుంచి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేశారు. -
కప్పు పాలు కోటి రూపాయలకు దారి
‘మెట్రో నగరాల్లో స్వచ్ఛమైన ఆవుపాలు లభించాలనుకోవడం అత్యాశగా మారిన ఈ రోజుల్లో ఓ పాతికేళ్ల యువతి చేసిన ప్రయత్నం ఆమెను కోటిరూపాయల వ్యాపారిగా నిలబెట్టింది. ఆ కోటీశ్వరురాలి పేరు శిల్పి సిన్హా. ఎనిమిదేళ్ల క్రితం వరకు జార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్ టౌన్లో ఉండేది. పై చదువుల కోసం బెంగళూరుకు వచ్చింది. మంచి పేరున్న హాస్టల్లో వసతి చూసుకుంది. ఓ కప్పు ఆవుపాలతో తన ఉదయాన్ని ప్రారంభించడం శిల్పి అలవాటు. పాలు తెప్పించుకుని తాగినప్పుడు ఆవి ఆమెకు మింగుడుపడలేదు. కారణం అవి కల్తీపాలు. స్వచ్ఛమైన కప్పు పాల కోసం బెంగళూరులో చాలా ప్రయత్నాలే చేసింది శిల్పి. ఆ సమయంలోనే ప్రతిముగ్గురు భారతీయులలో ఇద్దరు కల్తీపాలు తాగుతున్నారని ఫుడ్ రెగ్యులేటర్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే వివరాలు శిల్పి మనసును కలచివేశాయి. అప్పుడే తను బెంగళూరులోనే ఆవు పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. కొంతమంది పాడి రైతులను కలిసింది. భాష రాకపోయినప్పటికీ రైతుల వద్దకు వెళ్లిన శిల్పి ఆవుల దాణా, వాటి సంరక్షణ గురించి వివరాలు తెలుసుకుంది. బయటివారు ఇచ్చే ధర కన్నా తను కొంచెం ఎక్కువ మొత్తమే చెల్లిస్తానని చెప్పింది. రైతులు సంతోషంగా సరే అన్నారు. ది మిల్క్ ఇండియా పాలసేకరణకు పనివాళ్లు లేరు. వాళ్లకు చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బూ లేదు. అందుకని, తనే తెల్లవారుజామున మూడు గంటలకు రైతులవద్దకు వెళ్లేది. ఆమె నిజాయితీ, పాలలోని స్వచ్ఛత ఆరునెలల్లోనే వినియోగదారుల సంఖ్యను 500కు చేర్చేసింది. అది అంతకంతకూ పెరిగిపోతూండడంతో రెండేళ్ల కిందట జనవరిలో సంస్థకు ‘ది మిల్క్ ఇండియా’ అని పేరు పెట్టింది. ఈ సంస్థ ప్రారంభ పెట్టుబడి రూ.11,000. రెండేళ్లలోనే ‘ది మిల్క్ ఇండియా’సంస్థ కోటిరూపాయల టర్నోవర్‌కి చేరుకుంది. సాధ్యమైందిలా... ముందు ఒకటి నుండి తొమ్మిదేళ్ల పిల్లల ఎదుగుదలకు ఆవుపాలు ఎలా దోహదం చేస్తాయో వివరిస్తూ, వారిలో చైతన్యం కలిగించింది. నాణ్యమైన పశుగ్రాసం, Sర్ణాటక, తమిళనాడులోని 21 గ్రామాలకు వెళ్లి అక్కడి రైతులను కలిసి తమ వ్యాపార విషయాలతో పొందుపరిచిన నమూనాను ఇచ్చి చర్చలు జరుపుతుంది. నాణ్యమైన పశుగ్రాసాన్ని పశువులకు అందిస్తే ఆరోగ్యకరమైన పాలు వస్తాయని, ఆ పాలకు మంచి ధర ఇస్తానని హామీ ఇచ్చింది. దీంతో స్థానిక రైతులు ఆవులకు మొక్కజొన్నను ఆహారంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో అటు రైతులూ, ఇటు ‘ది మిల్క్ ఇండియా’ సంస్థ కూడా మంచి ఫలితాలను సాధించారు. శిల్పి మొదటి సవాల్ రైతుల నమ్మకాన్ని పొందడం. మొదట్లో అది జరగలేదు కానీ, కాలక్రమేణా అనేకమంది రైతులు శిల్పి చెప్పిన దారిలో పయనించారు. ఎనిమిదేళ్ల కిందట ఒక కప్పు పాల కోసం శిల్పి చేసిన ప్రయత్నం ఈ రెండేళ్లలో ఆమెను కోటి రూపాయల సామ్రాజ్యానికి రాణిని చేసింది. అలా తన వ్యాపారాన్ని తానే నిర్మించుకున్న సార్థక నామధేయురాలయింది శిల్పి. – ఆరెన్నార్ -
ఈ బంధం.. మానవత్వం
‘రక్తం నీటి కంటే చిక్కనైనది, అందుకే రక్త సంబంధం ముందు మరే బంధమూ నిలవలేదు’..ఇదీ ఇప్పటి వరకు మనం నమ్ముతున్న నిజం. ఇప్పుడు మరో నిజం ఈ నానుడిని తుడిచి పెట్టేసింది. కుటుంబ బంధం చేయలేని పనిని ఆఫీస్‌లో సహోద్యోగి చేసింది. కొలీగ్ మార్షనీల్ సిన్హా కోసం కిడ్నీ ఇచ్చేసింది దితీ లాహిరి! మార్షనీల్ సిన్హాది జార్ఖండ్‌లోని బొకారో. ఆమె బెంగళూరులో ఐటీసీ ఇన్ఫోటెక్లో ఉద్యోగి. ఆమె తరచూ అనారోగ్యం పాలవుతుంటే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కిడ్నీలు విఫలమయ్యాయని తెలిసినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె అలాగే ఉద్యోగం చేస్తోంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మార్షనీల్ మనోధైర్యానికి ఆశ్చర్యపోయారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఆఫీస్‌లో పూర్తి సమయం సీట్లో కూర్చోవడం కూడా కష్టంగా మారింది. అప్పుడు ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి ఆఫీస్ పని చేయడానికి)కు అనుమతించింది సంస్థ. సొంతూరు బొకారోకి వెళ్లి పోయి ఇంటి నుంచే ఉద్యోగం చేసింది మార్షనీల్. ఆమెకి అప్పగించిన ప్రాజెక్ట్ గురించి తరచూ ఫోన్లో కాంటాక్ట్‌లో ఉండేది దితీ లాహిరి. మార్షనీల్ డయాలసిస్ చేయించుకుంటూ కూడా ఆఫీస్ పని చేస్తోందని తెలిసినప్పుడు లాహిరి కదిలిపోయింది. అప్పుడడిగింది మార్షనీల్ని పూర్తి వివరాలు చెప్పమని. మార్షనీల్‌కి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారట డాక్టర్లు! ఆమెకు కిడ్నీ ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్లిద్దరికీ ఆరోగ్య సమస్యలున్నాయి. కాబట్టి కిడ్నీ ఇవ్వగలిగిన పరిస్థితి కాదు వారిది. ఇక మిగిలింది మార్షనీల్ అక్క. ఆమె కూడా సిద్ధంగానే ఉంది. అయితే అత్తగారింట్లో ససేమిరా అన్నారు. ఆ ఇంటికి కోడలయ్యాక ఇక ఆమె దేహం మీద అధికారాలు కూడా తమవే అన్నట్లుంది వాళ్ల ధోరణి. మార్షనీల్ సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోనూ కిడ్నీ దాతల కోసం అభ్యర్థించింది. ప్రయత్నాలైతే జరిగాయి కానీ కిడ్నీ ఇచ్చే దాత దొరకలేదు. అదీ ఆమె పరిస్థితి. అప్పుడు మార్షనీల్ మెడికల్ రిపోర్టులను తెప్పించుకుని తనకు తెలిసిన డాక్టర్‌ను సంప్రదించింది లాహిరి. ఆ డాక్టర్ కూడా కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పడంతో.. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది! నిబంధనలు కఠినతరం మార్షనీల్ కోసం కిడ్నీ ఇచ్చే దాత దొరకడమే కష్టం అనుకున్నారు అప్పటి వరకు. ప్రభుత్వ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయనేది లాహిరి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన తర్వాత తెలిసింది. రక్తసంబంధీకులు కాకుండా మరెవరి నుంచయినా కిడ్నీ తీసుకోవాల్సి వస్తే లెక్కకు మించినన్ని నియమాలు. అంతకంటే ఎక్కువ దర్యాప్తులు. అవయవాల అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించిన నేపథ్యంలో నిబంధనలు ఎక్కువయ్యాయి. తాను స్వచ్ఛందంగానే కిడ్నీ ఇవ్వదలచుకున్నట్లు పోలీసులకు అఫిడవిట్ దాఖలు చేసింది లాహిరి. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. కలెక్టర్‌కు తనకు సంబంధించిన పూర్తి వివరాల డాక్యుమెంట్లను సమర్పించింది. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకోసం తొమ్మిది నెలలు పట్టింది. ఇవన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్‌కు వెళ్లిన తరవాత అక్కడ ‘తన కిడ్నీని మార్షనీల్ కోసం ఇవ్వదలుచుకున్నానని, డాక్టర్లు తన దేహం నుంచి కిడ్నీ తీసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని సంతకం చేసింది. ఇదంతా పూర్తయి ఈ నెల మూడవ తేదీన కోల్‌కతాలోని ఫోర్టిస్ హాస్పిటల్ అండ్ కిడ్నీ ఇన్స్టిట్యూట్లో లాహిరికి, మార్షనీల్‌కి సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైందని, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని ప్రకటించారు డాక్టర్లు. అమ్మను చూస్తున్నాను మార్షనీల్ ఎంతో తెలివైన అమ్మాయి. చక్కటి వ్యక్తిత్తం ఆమెది. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అనారోగ్యం పాలవడం బాధనిపించింది. అలా దయనీయ స్థితిలో ప్రాణాలు పోతాయని తెలిసీ చూస్తూ ఊరుకోలేకపోయాను. నా నిర్ణయం విన్న వెంటనే అమ్మానాన్న విచిత్రంగా చూశారు. మా అమ్మ స్కూలు టీచరుగా పనిచేసి రిటైరైంది. ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. మరో విషయం ఏమిటంటే... అమ్మ చాలా ఏళ్లుగా ఒక కిడ్నీతోనే జీవిస్తోంది. మా కంటే చురుగ్గా ఉంటుంది కూడా. అందుకే నాకు ఆరోగ్యం పట్ల భయం లేదు. – దితీ లాహిరి, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ఇన్ఫోటెక్, బెంగళూరు – మంజీర -
ప్రొఫెసర్ సిన్హా
అబ్బాయి వైపు చూశాడు ప్రొఫెసర్ సిన్హా. వాడు ఏడ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. సిన్హా గుండె తరుక్కుపోయింది. ‘ఏ దేవుడు శపించాడో.. వీడు ప్రేమలో పడ్డాడు’ అనుకున్నాడు. కళ్లకు ఉన్న అద్దాలు తీసి, కర్చీఫ్‌తో వాటిని ఒకసారి తుడుచుకుని మళ్లీ కళ్లకు పెట్టుకున్నాడు ప్రొఫెసర్ స్వరూప్ సిన్హా. ఆ అమ్మాయి, అబ్బాయి ఇంకా మసగ్గానే కనిపిస్తున్నారు! అప్పుడర్థమైంది.. ప్రొఫెసర్ సిన్హాకు, తను తుడుచుకోవలసింది కళ్లద్దాలను కాదని. కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంటున్నట్లుగా కళ్లు తుడుచుకున్నాడు. ‘హెవెన్స్ రెస్టారెంట్’ అది. ప్రొఫెసర్ సిన్హా కొన్నాళ్లుగా అక్కడ ఆ జంటను చూస్తున్నాడు. ఆ జంట ఎప్పుడొచ్చినా అలవాటుగా ఒకే టేబుల్ మీద కూర్చుంటుంది. ఇద్దరు మాత్రమే కూర్చోడానికి రెండు కుర్చీలు వేసి ఉండే చిన్న టేబుల్ అది. ఆ టేబుల్ ప్రొఫెసర్ సిన్హా టేబుల్‌కు ఎదురుగా కాస్త దూరంలో ఉంటుంది. అతడూ అలవాటుగా ఒకే టేబుల్ మీద కూర్చుంటాడు. అతడు కూర్చొని ఉండే టేబుల్‌కి నాలుగు కుర్చీలు ఉంటాయి కానీ, ఎప్పుడూ అతడు మాత్రమే ఉంటాడు!అబ్బాయి వైపు చూశాడు ప్రొఫెసర్ సిన్హా. వాడు ఏడ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. సిన్హా గుండె తరుక్కుపోయింది. ‘ఏ దేవుడు శపించాడో.. వీడు ప్రేమలో పడ్డాడు’ అనుకున్నాడు.‘‘ఇదే ఆఖరు’’ అన్నాడు అబ్బాయి. ‘‘దేనికి ఆఖరు విక్కీ. నాతో మాట్లాడ్డమా, నన్ను కలవడమా?’’ అంది అమ్మాయి. ‘‘ఎప్పుడూ నేను మాట్లాడ్డమేనా స్విగ్గీ. నీకు మాట్లాడాలని ఉండదా? నీకు కలవాలని ఉండదా?’’ అన్నాడు. అమ్మాయి పేరు శ్రీగంధ. తనను చూస్తే చాలు కడుపు నిండిపోతుందని ‘స్విగ్గీ’ అని పేరు పెట్టుకున్నాడు. ఎప్పుడూ గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లు విక్కీ, శ్రీగంధ. కాలేజ్‌లో, కాలేజ్ బయట, వాళ్లింట్లో,వీళ్లింట్లో గంటలు గంటలు. ఆకలి తెలిసేదే కాదు. అప్పటికి స్విగ్గీ అన్న పేరుకు కూడా విక్కీ జీవితంలో ఏ ప్రామినెన్సూ లేదు. శ్రీగంధ పరిచయం అయ్యాక రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని, ఆ ఇరవై నాలుగ్గంటల్లోనూ సగం రేయి, సగం పగలు ఉంటాయని విక్కీ మర్చిపోయాడు. శ్రీగంధకు ఇవి మరుపుకు రాలేదు కానీ, గుర్తు చేయడానికి విక్కీ ఉన్నాడు కదా అని తను కావాలనే మర్చిపోయింది. అలా ఇద్దరూ లోకాన్ని మర్చిపోయి, కబుర్ల లోకంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఓ రోజు శ్రీగంధ సడన్‌గా కడుపు పట్టుకుని ‘అబ్బా’ అంది!‘‘ఏమైంది శ్రీగంధా?’’ అన్నాడు విక్కీ. ‘‘ఆకలి’’ అంది!‘‘నిజమే.. నాక్కూడా’’అన్నాడు. అన్నాక, ఉలిక్కిపడ్డాడు. ‘శ్రీగంధకు తన మీద గానీ, తనకు శ్రీగంధ మీద గానీ ప్రేమ తగ్గలేదు కదా’ అని తొలిసారి అతడికి సందేహం వచ్చింది. ప్రేమ తగ్గితేనే మనసుకు నానా చెత్తా గుర్తుకొస్తుంది! అయినా ఇప్పుడు గుర్తుకొచ్చింది కడుపుకు గానీ, మనసుకు కాదు కదా అని తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. ‘మనసుకు గుర్తుకొస్తే అది చెత్త అవుతుంది. కడుపుకు గుర్తుకొస్తే అది ఆకలి అవుతుంది’ అని అనుకున్నాడు. ‘ఆకలి.. చెత్త కాదు, అదొక సహజమైన భౌతిక ఆలోచన’ అని కూడా తనని తను కన్విన్స్ చేసుకున్నాడు.‘‘ఏం చేద్దాం?’’ అంది శ్రీగంధ. ‘‘తెప్పించుకుందాం’’ అన్నాడు విక్కీ. ప్రేమలో పడిన కొన్ని యుగాల తర్వాత ఇద్దరూ కలిసి చేసిన తొలి భోజనం అది. ఉన్నచోటికే తెప్పించుకున్నారు. స్విగ్గీ నుంచి డెలివరీ అయింది. అప్పట్నుంచి శ్రీగంధ అతడికి ఆకలి తీర్చిన దేవతై.. ‘స్విగ్గీ’గా అవతరించింది. ప్రొఫెసర్ స్వరూప్ సిన్హా ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడు. ‘‘ఏంటి విక్కీ ఇలా అయిపోతున్నావ్! నాకు ధైర్యం చెప్పాల్సిందిపోయి..’’ అంటోంది అతడి చెంపను తన చేతి నిండా నింపుకుని.‘‘ఏం చెప్పాలి స్విగ్గీ? నేనేమైపోతే నీకేం, ధైర్యంగా వెళ్లి మీ అమ్మానాన్న చూసిన అబ్బాయినే చేస్కో అని ధైర్యం చెప్పాలా?’’ అన్నాడు విక్కీ. ‘‘నన్నేం చెయ్యమంటావ్?’’ అంది శ్రీగంధ.‘‘ఈ ప్రశ్న నన్నడిగావా? ‘శ్రీగంధా నేన్నిన్ను ప్రేమిస్తున్నాను..’ అని మూడేళ్ల క్రితం ఫస్ట్ టైమ్ నేను నీకు చెప్పినప్పుడు.. ‘నన్నేం చెయ్యమంటావ్ విక్కీ?’ అని అప్పడు నన్ను అడిగావా! కళ్లతోనే నువ్వు నాకు ఐ లవ్యూ చెప్పలేదూ? అప్పుడు నువ్వు నాకు ‘ఎస్’ చెప్పావంటే.. ఇప్పుడు నువ్వు మీ వాళ్లకు ‘నో’ చెప్పాలనే కదా అర్థం?’’‘‘కానీ విక్కీ... నేను భయపడిపోయాను. అమ్మానాన్నకు ‘ఎస్’ చెప్పలేదు, ‘నో’ చెప్పలేదు. నా జీవితంలో నువ్వున్నావని కూడా చెప్పలేకపోయాను విక్కీ. అందుకే అడుగుతున్నా.. ఏం చెయ్యమంటావని!’’ అంది శ్రీగంధ. ఇప్పుడు శ్రీగంధ కూడా ఏడ్వడాన్ని ప్రొఫెసర్ సిన్హా తన టేబుల్ మీద నుంచి గమనించాడు. ‘ఏ దేవుడు వరం ఇవ్వకపోతేనో అమ్మాయిలు ప్రేమలో పడతారు’ అనుకున్నాడు. అమ్మాయి చేతిలోని శుభలేఖను చూస్తూ భోరుమంటున్నాడు అబ్బాయి. సిన్హా భారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. నేనేం చేయగలను అనుకున్నాడు. అబ్బాయి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మాయి ఏడుపును ఆపుకుంటోంది. సిన్హా కళ్లు కూడా వర్షించడానికి సిద్ధం అవుతున్నాయి. మళ్లొకసారి కర్చీఫ్ తియ్యబోతుండగా.. పెద్ద అరుపు వినిపించింది. అబ్బాయి ఏడుపు అకస్మాత్తుగా.. కోపంగా మారిపోయింది! ‘‘వెళ్లిపో ఇక్కణ్ణుంచి. జీవితంలో మళ్లీ నాకు కనిపించకు స్విగ్గీ. కనిపించకు’’ అని ఊగిపోతున్నాడు అబ్బాయి. శ్రీగంధ కళ్లు తుడుచుకుంటూ కుర్చీలోంచి పైకి లేచింది. అతడి భుజాలను ప్రేమగా తాకింది. గట్టిగా విదిలించుకున్నాడు. ‘నన్ను క్షమించు విక్కీ’ అంది. అతడు పట్టించుకోలేదు. ప్రొఫెసర్ సిన్హా ఇదంతా మౌనంగా గమనిస్తున్నాడు. ‘నన్ను డిస్ట్రర్బ్ చెయ్యకు.. వెళ్లిపో’ అన్నట్లు అబ్బాయి టేబుల్‌పై తల వాల్చుకున్నాడు. అమ్మాయి మెల్లిగా డోర్ తెరుచుకుని బయటికి వెళ్లిపోయింది. డోర్ అద్దాల్లోంచి ఆ అమ్మాయినే చూస్తున్నాడు ప్రొఫెసర్ సిన్హా.చూస్తూ.. చూస్తూ ఒక్కసారిగా హతాశుడయ్యాడు సిన్హా.‘రేయ్.. గాడిదా! లేవరా.. అమ్మాయి నీకోసమే వచ్చిందిరా.. లేవరా..’’ అని అబ్బాయి వైపు చూసి పెద్దగా అరుస్తున్నాడు. వాడికి వినపడినట్లు లేదు! ‘‘రేయ్.. నిన్నొదిలి వెళ్లలేకేరా తను వెళ్లిపోయిందీ’’ అంటున్నాడు. అయినా వాడు వినడం లేదు. సిన్హా మళ్లీ అద్దాల్లోంచి ఆ అమ్మాయి వైపు చూశాడు. వెనక్కు తిరిగైనా చూడకుండా వెళ్లిపోతోంది. ‘పాపం.. ఎంత క్షోభ పడుతోందో’ అనుకున్నాడు ప్రొఫెసర్ సిన్హా. ఆమెను కాళ్లు నడిపించడం లేదు. ఆమె కాళ్లసలు భూమినే తాకడం లేదు. -
దిల్వాలా
ఆటో చూడు ఆటో చూడు.... మనసున్న మనిషిని చూడు... నిస్వార్థ సేవను చూడు... మానవత్వపు మార్గం చూడు.... మంచిని పెంచె పనిని చూడు... జాదవ్ భాయ్ ఘనతను చూడు... ఆ ఆటో గొప్పను చూడు.... అతడిలా మంచిని పెంచరా... అతని మార్గం అందరికీ మేలురా... ‘నీ గాంధీగిరితో ఇంట్లోవాళ్లను చంపేస్తావా? చూడు ఏమైందో? స్కూల్ ఫీజు కట్టలేదని వాడి ఫైనల్ రిజల్ట్స్ ఏంటో చెప్పలేదు టీచర్లు’ అరుస్తోంది భార్య. ‘ఒరేయ్.. రెక్కాడితే కాని డొక్కాడని మనకెందుకురా ఈ ఉచితసేవా కార్యక్రమాలు? నీ సంపాదన మీదే మేమంత ఆధారపడ్డాం.. కాస్త చూసుకో.. బాధ్యతగా నడుచుకో’ సలహా లాంటి హెచ్చరిక నాన్న నుంచి. అసహనంతో ఇంట్లోంచి బయటపడ్డాడు. ఊరంతా ఆటో తిప్పుతున్నాడు. ఆలోచనల్లో పడ్డాడు.‘నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా అలవాటుతో ఇంట్లోవాళ్లను బాధ పెడ్తున్నానా? ఇంటిని నడిపే బాధ్యత తన మీద ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లను కష్టపెట్టకూడదు కదా. నా తత్వానికి నా కొడుకు ఎందుకు బలి కావాలి? తప్పు నాదేనా? ఎవరికి వాళ్లు ఇలా బంధాలు, బాధ్యతలు అనుకుంటూ వాటికి బందీ అయితే మంచి ఎలా బతుకుతుంది? ఎవరో ఒకరు కష్టపడితేనే కదా.. పది మంది బాగుపడేది. లేదు... నేనే తప్పూ చేయట్లేదు. ఇంకో కష్టం చేసైనా సరే పిల్లాడి ఫీజు కడ్తాను. అంతే కాని నా దారి మార్చుకునేది లేదు’ అంతర్మధనంలోంచి గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఓ సాదాసీదా ఆటోవాలా! పేరు ఉదయ్‌సిన్హ్ రమణ్‌లాల్ జాదవ్. ఊరు గుజరాత్‌లోని అహ్మదాబాద్. మరి ఇంట్లో వాళ్లు అభ్యంతర పెట్టేంత పని ఈయన ఏం చేస్తున్నాడు? ఏంలేదు.. మీటర్ వేయకుండా బేరం చేయకుండా ఆటో నడుపుతుంటాడు. గమ్యం చేర్చాక ‘మీకు తోచినంత ఇవ్వండి’ అంటాడు చిరునవ్వుతో! అదీ కూడా తర్వాత ఎక్కే ప్యాసెంజర్స్ కోసమే అని విన్నవిస్తాడు. అంటే వీళ్ల ప్రయాణం ఉచితంగానే సాగినట్టన్నమాట. దయగల మహాత్ములు వచ్చిన దూరం కంటే ఎక్కువే డబ్బులు ఇవ్వచ్చు. కొంతమంది బొటాబొటి కట్టొచ్చు. ఇంకొంత మంది తక్కువే ఇవ్వచ్చు. చాలా మంది అసలు ఇవ్వకపోనూ వచ్చు. అయినా సరే అతడిది అదే ధోరణి. అదీగాక ఈ ఆటోవాలా పేదవాళ్లకు, వికలాంగులకు ఫ్రీ సర్వీస్ ఇస్తుంటాడు. అలా ఆయన అనుసరిస్తున్న గాంధీమార్గం వల్ల ఇంటి ఖర్చులకు సరిపడా కాసులు రావడం లేదు. భారం అంతా ఇంటిని చక్కదిద్దుతున్న ఉదయ్‌సిన్హ్ భార్య మీద పడుతుంటుంది. కాని మంచి పనికి మొదట కష్టం ఎదురు కావచ్చు. తర్వాత విజయమే వరిస్తుంది. ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందాడు? అహ్మదాబాద్‌లో పేదవాళ్ల కోసం ‘మానవ్ సాద్నా’ అనే ఓ ఎన్జీవో పని చేస్తుంటుంది. కుల, మతభావాలకు అతీతంగా పేదవాళ్లకు అన్నం పెడ్తుంటుంది. బయట ఎంత కొట్టుకుంటున్నా ఆకలయ్యే సరికి జనం ఈ మానవ్ సాద్నా అనే ఒకే చూరుకిందకు రావడం అన్ని మరిచి పోయి కడుపు నింపుకోవడం చూసి ఆశ్చర్యపోయేవాడు ఉదయ్ సిన్హ్. వీళ్లందరినీ ఇలా ఒక్కటి చేస్తున్న మానవ్ సా«ద్నా వలంటీర్ల ప్రయత్నానికి ముగ్ధుడయ్యి తనూ వారితో కలిశాడు. చేరాడు. రెండేళ్లు పనిచేశాడు. ఆ తత్వాన్ని ఒంటబట్టించుకున్నాడు. బయటకు వచ్చాక అక్కడ నేర్చుకున్న సంస్కారాన్ని కార్యరూపంలో పెట్టాలనుకుని ‘అహ్మదాబాద్ నొ ఆటోరిక్షావాలో’ (పే ఇట్.. ఫార్వర్డ్) పేరుతో ఆటో స్టార్ట్ చేశాడు. అదే తోచినంత ఇచ్చే కాన్సెప్ట్ ఆటో. ఎక్కిన ప్యాసెంజర్ తర్వాత ఎక్కబోయే ప్యాసెంజర్ డబ్బులు కట్టాలన్నమాట. గమ్మం చేరాక ప్రయాణికులు దిగగానే హార్ట్‌షేప్‌లో ఉన్న మెనూకార్డ్ లాంటి కార్డ్ ఇస్తాడు. ‘ఆదరంగా ఇవ్వండి’ అని చెప్తాడు. అతని ఆటో వెనక పెద్ద పెద్ద అక్షరాలతో ‘పే ఫ్రమ్ యువర్ హార్ట్’ అని రాసి ఉంటుంది. ఏమీ ఇవ్వలేని వాళ్లు మనసారా నవ్వితే చాలని ఆరాటపడ్తాడు ఉదయ్. అయితే అతను ఈ సర్వీస్ మొదలుపెట్టినప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కాని రాను రానూ ఈ కాన్సెప్ట్ అందరిలోకి వెళ్లి ఉదయ్సిన్హ్కి డిమాండ్ పెరిగే సరికి తోటి ఆటోవాలాలు అతని మీద పెద్ద పోరాటానికే దిగారు. నవ్వు చెడిందే కాక మా గిరాకీ చెడగొడ్తున్నావ్ అంటూ. అయినా ఉదయ్ తన ఆటోకి బ్రేక్ వేయలేదు. చివరకు తోటి ఆటోవాలాలే నెమ్మదిగా తగ్గి అడ్డుఅదుపు లేకుండా తిరుగుతున్న మీటర్‌ను క్రమపద్ధతికి మార్చారు. ‘ఉదయ్ భాయ్లా పెద్ద మనసు మాకు లేదులే కాని నిజాయితీగా పని చేయాలని మాత్రం అనుకున్నాం’ అని చెప్తారు ఆ ఆటోవాలాలు. ఉదయ్ సిన్హ్ నిజంగానే గ్రేట్. అమితాబ్ ఎక్కిన ఆటో ఉదయ్‌సిన్హ్ సర్వీస్ ఊసు ఆ మీడియా ఈ మీడియా ద్వారా దేశమంతా ప్రచారమైంది. ముంబైలో ఉన్న అమితాబ్‌కి, చేతన్భగత్కీ తెలిసింది. అతనిని కలుసుకోవడం కోసం ఈ ఇద్దరూ అహ్మదాబాద్ వచ్చి అతని ఆటో ఎక్కి ఊరంతా తిరిగారు. అతని కుటుంబాన్ని కలుసుకున్నారు. తోచినంత డబ్బిచ్చారు. అతని గాంధీగిరిని చూసి కళ్లెర్ర చేసిన ఆయన భార్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా? ‘మావారు చేస్తున్న పని చాలా ఆలస్యంగా అర్థమైంది. ఆయన్ని చూసి నాకూ ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే మా ఆయన ఆటోలో ఎక్కే పేద ప్రయాణికుల కోసం ఢోక్లా, లస్సీ తయారు చేసి ఆటోలో పెడ్తాను’ అంటుంది. ఉదయ్ వాళ్ల నాన్న ఆకలిగొన్న పశువులకు దాణా వేస్తుంటాడు. ఇలా తన కుటుంబాన్ని, చుట్టుపక్కల వాళ్లకూ స్ఫూర్తి పంచుతున్న ఉదయ్‌సిన్హ్ రమణ్లాల్ను రెడ్ ఎఫ్.ఎమ్ ‘బడే దిల్వాలే’ పురస్కారాన్ని, రోటరీ క్లబ్ కూడా సేవా అవార్డ్‌ను ఇచ్చి సత్కరించింది. తన సేవకు బరోడా మేనేజ్మెంట్ అవార్డ్‌నూ అందుకున్నాడు ఉదయ్‌సిన్హ్. ‘ఎవరికి వాళ్లు నేనేమై పోవాలి అనుకుంటే ఏదీ ముందుకు కదలదు. ఎదుటి వ్యక్తికి సహాయపడ్డమనేది చెప్తే వచ్చేది కాదు.. అది మనలో సహజసిద్ధంగా ఉండాలి’ అంటాడు మనసున్న ఆటోవాలా ఉదయ్‌సిన్హ్ రమణ్‌లాల్ జాదవ్. -
టెల్కోలపై ఫైన్.. పరిశీలించనున్న ప్రభుత్వం
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా కుట్రలు పన్నిన మూడు టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలకు 3050 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ జరిమానాను ప్రతిపాదించింది. అయితే ట్రాయ్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించనుందని కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే పరిశీలన చేపడతామని సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సిన్హా తెలిపారు. టెల్కోలకు విధించిన శిక్ష సరియైనదేనని, పెద్ద ఎత్తున్న ప్రజల ప్రయోజనాలు దీనిలో భాగమై ఉన్నాయని ట్రాయ్ పేర్కొంది. దీనికి సంబంధించి టెలికాం డిపార్ట్ మెంట్ కు రెగ్యులేటరీ బుధవారం ఓ లేఖను రాసింది. లైసెన్సు సర్వీసు ఏరియాలను ఆధారంగా చేసుకుని తాము ఈ పెనాల్టీలను విధించామని ట్రాయ్, డీఓటీకి చెప్పింది. ఎయిర్ టెల్ కు 1,050 కోట్లు, వొడాఫోన్, ఐడియాలకు రూ.950 కోట్లు జరిమానాలు విధించినట్టు పేర్కొంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వకుండా టెలికాం దిగ్గజాలు కుట్రపన్నుతున్నాయని వీటికి అక్టోబర్ లోనే ఈ మేర జరిమానాను ట్రాయ్ విధించింది. అవసరమైన పోల్ ఇవ్వకపోవడం లైసెన్సు నిబంధనలు ఉల్లంఘించడమేనని టెలికాం రెగ్యులేటరీ పేర్కొంది. -
మోదీ టీ అమ్మిన రైల్వేస్టేషన్‌కు మహర్దశ!
సచానా(అహ్మదాబాద్): ప్రధాని మోదీ తన బాల్యంలో టీ అమ్మిన గుజరాత్‌లోని వాద్నగర్ రైల్వేస్టేషన్‌కు మహర్దశపట్టనుంది. ఆ స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 8 కోట్లు కేటాయించినట్లు రైల్వే సహాయ మంత్రి సిన్హా తెలిపారు. తాను బాల్యంలో ఈ స్టేషన్లో తండ్రితో కలసి టీ అమ్మేవాడినని మోదీ గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తరచూ చెప్పడం తెలిసిందే. మోదీ వాద్‌నగర్‌లోనే జన్మించారు. వాద్‌నగర్‌తోపాటు సమీపంలోని మోధెరా, పఠాన్ ప్రాంతాలను రూ. 100 కోట్లతో పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేస్తారని, వాద్నగర్ స్టేషన్ అభివృద్ధి ఈ ప్రాజెక్టులో భాగమని రైల్వే అధికారులు చెప్పారు. వాద్నగర్–మెహ్సనా రైలు మార్గంలోని మీటర్ గేజ్‌ను బ్రాడ్ గేజ్‌లోకి మార్చే ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని వివరించారు. -
సెబీ చైర్మన్ సిన్హా పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యూ కే సిన్హా పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సెబీ చైర్మన్‌గా సిన్హా వచ్చే ఏడాది మార్చి 1 వరకు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే దాకా పదవిలో కొనసాగుతారు. మామూలుగా సెబీ చైర్మన్‌గా సిన్హా పదవీకాలం ఈ నెల 17తో ముగుస్తుంది. సిన్హా బిహార్‌కు కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 2011 ఫిబ్రవరి 18న సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. -
రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారానికి మూలం?
‘జాతి భవిష్యత్తును సర్వతోముఖంగా తీర్చిదిద్దడానికి రాజ్యం ప్రాథమిక శాసనాన్ని రూపొందించుకోవాలి. దీని కోసం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలి’ అనే భావన తొలిసారిగా పాశ్చత్య దేశాల్లో ఏర్పడింది. మొదటగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పర్చుకున్న రాజ్యాలు - అమెరికాలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ (క్రీ.శ. 1787), ఫ్రాన్స నేషనల్ అసెంబ్లీ (1789-91). ఇవి విప్లవాల మూలంగా ఉద్భవించాయి. తమ దేశ పౌరులకు ఉజ్వల భవిష్యత్‌ను కల్పించే సాధనాలుగా అవి రూపొందించుకున్న రాజ్యాంగ శాసనాలు ప్రపంచంలోని ఇతర రాజ్యాలకు ఆదర్శమయ్యాయి. భారత రాజ్యాంగ పరిషత్ భారత జాతి స్వయం పరిపాలన కోసం దేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని మొదట ఎం.ఎన్. రాయ్ 1934లో అభిప్రాయపడ్డారు. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకించి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని 1936 పైజ్‌పూర్ సమావేశంలో తీర్మానించారు. భారతీయులతో రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసినట్లయితే కుల, మత, వర్గ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గాంధీజీ 1939లో ‘హరిజన’ పత్రికలో రాశారు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం తదితర అంశాలను నిర్ణయించారు. 1946 జూలై, ఆగస్టులో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. 1946 నవంబర్‌లో పరిషత్ సంపూర్ణంగా ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి, నలుగురు బ్రిటిష్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపికయ్యారు. దేశ విభజన తర్వాత మిగిలిన సభ్యుల సంఖ్య 299. వీరిలో ఎన్నికైన వారు 229, నియమితులైనవారు 70 మంది. సీనియర్ సభ్యుడైన సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ప్రారంభమైంది. దీనికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్; ఉపాధ్యక్షులుగా హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి; సలహాదారునిగా బిఎన్.రావును ఎన్నుకున్నారు. డిసెంబర్ 13న జవహర్ లాల్ నెహ్రూ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే రాజ్యాంగ ప్రవేశిక మూలం. రాజ్యాంగ పరిషత్ దీన్ని 22 జనవరి 1947న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో 12 విషయ నిర్ణాయక, 10 విధాన నిర్ణాయక కమిటీలున్నాయి. వీటిలో ముఖ్యమైంది ముసాయిదా సంఘం. ముసాయిదా సంఘం దీన్ని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య 7. అధ్యక్షుడు - అంబేద్కర్. సభ్యులు - గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం. మున్షి, మహమ్మద్ సాదుల్లా, మిట్టల్, కేతాన్. మిట్టల్ అనారోగ్యానికి గురవడం, కేతాన్ మరణించడంతో వీరి స్థానాల్లో వరుసగా మాధవరావు, కృష్ణమాచారి నియమితులయ్యారు. ముసాయిదా రూపకల్పనకు 114 రోజులు పనిచేశారు. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించారు. రాజ్యాంగ ప్రతిపై 7635 సవరణలు ప్రతిపాదించగా, 2473 మాత్రమే చర్చకు వచ్చాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను ఏకగ్రీవంగా ఆమోదించి, చట్టంగా మార్చింది. ఈ సమావేశానికి 284 మంది సభ్యులు హాజరయ్యారు. అప్పటి నుంచి రాజ్యాంగం పాక్షికంగా అమల్లోకి వచ్చింది. నెహ్రూ 1929 జనవరి 26న లాహోర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్య తీర్మానం’ ప్రవేశపెట్టారు. దీనికి గుర్తింపుగా 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకువచ్చారు. రాజ్యాంగ పరిషత్తు రెండేళ్ల 11 నెలల 18 రోజులు పనిచేసింది. రాజ్యాంగ రూపకల్పనకు అయిన మొత్తం ఖర్చు రూ. 64 లక్షలు. రాజ్యాంగ పరిషత్ గుర్తు ‘ఐరావతం’. రాజ్యాంగ పరిషత్ మొత్తం 12 పర్యాయాలు సమావేశమైంది. చివరి సమావేశాన్ని 1950 జనవరి 24న నిర్వహించారు. ఈ సమావేశంలోనే మొదటి అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు. పని విధానం ఆధారంగా రాజ్యాంగ పరిషత్‌ను మూడు దశలుగా పేర్కొనవచ్చు. మొదటి దశ: 9 -12-1946 నుంచి 15 - 8 - 1947 వరకు. ఈ దశలో ఇది రాజ్యాంగ పరిషత్తుగా మాత్రమే పనిచేసింది. రెండో దశ: 15 - 8 -1947 నుంచి 26 -11- 1949 వరకు. ఈ దశలో రాజ్యాంగ పరిషత్గా, పార్లమెంట్‌గా పనిచేసింది. మూడో దశ: 26-11-1949 నుంచి 14-5- 1952 వరకు. ఈ మధ్యకాలంలో పార్లమెంట్‌గా మాత్రమే పనిచేసింది. పార్లమెంట్‌గా శాసన విధులను నిర్వహిస్తున్నప్పుడు అధ్యక్షునిగా జి.వి. మౌలాంకర్, ఉపాధ్యక్షునిగా అనంతశయనం అయ్యంగార్ వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన వివిధ వర్గాల ప్రముఖులు: 1. భారత జాతీయ కాంగ్రెస్ - నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్ 2. ముస్లిం వర్గం - మౌలానా అబుల్ కలామ్ అజాద్, సయ్యద్ సాదుల్లా 3. సిక్కులు - సర్దార్ బలదేవ్‌సింగ్, హుకుంసింగ్ 4. యూరోపియన్లు - ప్రాంక్ అంథోనీ 5. మైనార్టీలు - హెచ్.సి. ముఖర్జీ 6. అఖిల భారత షెడ్యూల్ కులాలు - బి.ఆర్. అంబేద్కర్ 7. కార్మిక వర్గం - బాబు జగ్జీవన్‌రామ్ 8. పారశీలు -డాక్టర్ హెచ్.పి. మోడి 9. అఖిల భారత మహిళా సమాఖ్య - హంసా మెహతా 10. అఖిల భారత జమీందార్ల సంఘం - దర్బంగ మహారాజా 11. హిందూ మహాసభ - డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రాజ్యాంగ పరిషత్ కమిటీలు - అధ్యక్షులు 1. సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్ 2. నియమ నిబంధనల కమిటీ - రాజేంద్రప్రసాద్ 3. జెండా కమిటీ - రాజేంద్రప్రసాద్ 4. ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ పటేల్ 5. అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ పటేల్ 6. రాష్ట్ట్రాల అధికారాల కమిటీ - సర్దార్ పటేల్ 7. రాష్ర్ట రాజ్యాంగ కమిటీ - సర్దార్ పటేల్ 8. కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ 9. కేంద్ర అధికారాల కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ 10. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ - జవహర్ లాల్ నెహ్రూ 11. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ - జె.బి. కృపలాని 12. అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ - డాక్టర్ హెచ్.సి. ముఖర్జీ 13. హోస్ (ఏౌఠట్ఛ) కమిటీ - పట్టాభి సీతారామయ్య 14. సభ వ్యవహారాల కమిటీ - జి.వి. మౌలాంకర్ భారత రాజ్యాంగానికి ముఖ్య ఆధారాలు - గ్రహించిన అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం: సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ట్ర సంబంధాలు, అత్యవసర అధికారాలు, ద్విసభ విధానం. బ్రిటన్: పార్లమెంటరీ ప్రభుత్వం, ిస్పీకర్ వ్యవస్థ, శాసన ప్రక్రియ, సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఎన్నికల యంత్రాంగం, ఉద్యోగుల ఎంపిక పద్ధతులు. అమెరికా: ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ఆధిక్యత, న్యాయసమీక్ష, స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ర్టపతి వ్యవస్థ, మహాభియోగ తీర్మానం. ఐర్లాండ్: ఆదేశిక సూత్రాలు, రాష్ర్టపతి ఎన్నిక, రాజ్యసభ్యుల నియామక పద్ధతి. కెనడా: సమాఖ్య నిర్మాణం, అవశిష్ట అధికారాలు, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి సుప్రీంకోర్ట్టు సలహా కోరడం. ఆస్ట్రేలియా: ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉమ్మడి సభ సమావేశం, కేంద్ర రాష్ట్రాల వాణిజ్య సంబంధాలు. ఫ్రాన్స: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర రాజ్యం, తాత్కాలిక స్పీకర్. జపాన్: జీవించే హక్కు, చట్టం నిర్ధారించిన పద్ధతి. జర్మనీ: జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం. దక్షిణాఫ్రికా: రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ్యుల ఎన్నిక. రష్యా: ప్రాథమిక విధులు, సామ్యవాద విధానం, న్యాయం. విమర్శలు భారత రాజ్యాంగం 1935 చట్టపు ‘జిరాక్స్’ కాపీ - ప్రొఫెసర్ కె.టి.షా. భారత రాజ్యాంగం ఒక ‘న్యాయవాదుల స్వర్గం’ - ఐవర్ జెన్నింగ్‌స. భారత రాజ్యాంగ పరిషత్ ఒక ‘హిందువుల సభ’ - సైమన్. రాజ్యాంగ పరిషత్ అనేది కాంగ్రెస్ పార్టీ సభ - గ్రాన్విల్లె ఆస్టిన్. 1. రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని జత ఏది? 1) రూల్స్ కమిటీ - రాజేంద్రప్రసాద్ 2) సలహా సంఘం - వల్లభాయ్ పటేల్ 3) సారథ్య సంఘం - జవహర్ లాల్ నెహ్రూ 4) ప్రాథమిక హక్కుల ఉపసంఘం - జె.బి. కృపలానీ 2. రాజ్యాంగ పరిషత్‌కు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు? 1) సర్దార్ పటేల్ 2) జె.బి.కృపలానీ 3) జవహర్ లాల్ నెహ్రూ 4) కృష్ణస్వామి అయ్యర్ 3. రాజ్యాంగ పరిషత్ గురించి మొదట ఎక్కడ ప్రస్తావించారు? 1) 1942 క్రిప్స్ ప్రతిపాదనలు 2) సైమన్ కమిషన్ 3) క్యాబినెట్ మిషన్ ప్లాన్ 4) వేవెల్ ప్రకటన - 1945 4. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారానికి మూలం? 1) రాజ్యాంగం 2) పార్లమెంట్ 3) రాష్ట్రపతి 4) ప్రజలు 5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) ప్రాథమిక హక్కులు - అమెరికా 2) జీవించే హక్కు - జపాన్ 3) అత్యవసర పరిస్థితి - జర్మనీ 4) పైవన్నీ 6. కిందివారిలో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడెవరు? 1) వి.టి. కృష్ణమాచారి 2) హెచ్.సి. ముఖర్జీ 3) సచ్చిదానంద సిన్హా 4) ప్రాంక్ అంథోని 7. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ? 1) 26-1-1950 2) 26-11-1949 3) 15-8-1947 4) 24-1-1950 సమాధానాలు 1) 3; 2) 3; 3) 1; 4) 4; 5) 4; 6) 4; 7) 2. -
మీడియాపై కక్ష సాధింపు తగదు
‘సాక్షి’ ప్రతినిధులను అడ్డుకోవడం చట్టవిరుద్ధం ఆంధ్రా సీఎం తీరు అప్రజాస్వామికం ఐజేయూ జాతీయ సమావేశాల్లో కీలకతీర్మానాలు తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో రెండో రోజు ఆదివారం ఐజేయూ కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా అధ ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ కార్యదర్శి నివేదికను అందించారు. 16 రాష్ట్రాల ప్రతినిధులు చర్చలో పాల్గొని, దేశవ్యాప్తంగా మీడియా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత, మీడియాపై దాడులు, ట్రాయ్ సిఫార్సులు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పత్రికా సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ చానల్ ప్రతినిధులను హాజరుకానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవడంపైనా చర్చించారు. ఇది చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం, మీడియా వ్యతిరేక చర్యగా ఐజేయూ ప్రతినిధులు పేర్కొన్నారు. సమాచార పౌరసంబ ంధాల శాఖ నుంచి అక్రిడిటేషన్ కలిగిన ‘సాక్షి’ సిబ్బందిని సీఎం పత్రికా సమావేశాలకు రానీయకపోవడం మీడియా స్వేచ్ఛపై దాడిగా, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కుకు అవరోధం కలిగించే చర్యగా ఐజేయూ అభిప్రాయపడింది. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న సాక్షి పత్రిక ప్రతినిధుల పట్ల సీఎం భద్రతా సిబ్బంది అనుసరిస్తున్న వివక్షపూరిత చర్యలను విరమించుకోవాలన్నారు. దీనిపై ఏపీ సీఎం సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి సాక్షి ప్రతినిధులను తన పత్రికా సమావేశాలకు హాజరయ్యేట్లు చూడాలని, పత్రికా స్వేచ్ఛకు గల పవిత్రతను కాపాడాలని కోరారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన తెలంగాణలో మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతినిధులు చర్చించారు. ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతినిధిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియాపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీడియాపై ఇంత దారుణంగా విరుచుకుపడుతున్న వ్యక్తి మరెవ్వరూ లేరన్నారు. -
సీమాంధ్రకు ప్రత్యేక హోదా... బీహార్‌లో 'ఆందోళనలు'
ఆంధ్రప్రదేశ్ విభజనతో సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంతో బీహార్‌లోని రాజకీయ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ బీహార్ రైలు రాకో నిర్వహించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే స్థానిక రైళ్లు కూడా ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని రైలురోకోకు నాయకత్వం వహించిన దినాపూర్ ఎమ్మెల్యే ఆశా సిన్హా మీడియాకు తెలిపారు. కేంద్రం తమ డిమాండ్‌ను పెడ చెవిన పెట్టిందని ఆరోపించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినప్పుడు బీహార్‌కు ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ ఆశా ఈ సందర్బంగా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే వరకు ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్‌పై కేంద్రం దిగివచ్చే విధంగా ఆందోళనలు ఉండాలని బీజేపీ నాయకుడు జనార్దన్ కుమార్ ఆందోళనకారులకు సూచించారు. బంద్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తమ ఆందోళనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే బీహార్ ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తు అధికార జేడీ (ఎస్) పార్టీ అధినేత, సీఎం కిరణ్ మార్చి 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.