‘సాక్షి’ ప్రతినిధులను అడ్డుకోవడం చట్టవిరుద్ధం
ఆంధ్రా సీఎం తీరు అప్రజాస్వామికం
ఐజేయూ జాతీయ సమావేశాల్లో కీలకతీర్మానాలు
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో రెండో రోజు ఆదివారం ఐజేయూ కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా అధ ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ కార్యదర్శి నివేదికను అందించారు. 16 రాష్ట్రాల ప్రతినిధులు చర్చలో పాల్గొని, దేశవ్యాప్తంగా మీడియా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత, మీడియాపై దాడులు, ట్రాయ్ సిఫార్సులు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పత్రికా సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ చానల్ ప్రతినిధులను హాజరుకానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవడంపైనా చర్చించారు.
ఇది చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం, మీడియా వ్యతిరేక చర్యగా ఐజేయూ ప్రతినిధులు పేర్కొన్నారు. సమాచార పౌరసంబ ంధాల శాఖ నుంచి అక్రిడిటేషన్ కలిగిన ‘సాక్షి’ సిబ్బందిని సీఎం పత్రికా సమావేశాలకు రానీయకపోవడం మీడియా స్వేచ్ఛపై దాడిగా, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కుకు అవరోధం కలిగించే చర్యగా ఐజేయూ అభిప్రాయపడింది. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న సాక్షి పత్రిక ప్రతినిధుల పట్ల సీఎం భద్రతా సిబ్బంది అనుసరిస్తున్న వివక్షపూరిత చర్యలను విరమించుకోవాలన్నారు. దీనిపై ఏపీ సీఎం సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి సాక్షి ప్రతినిధులను తన పత్రికా సమావేశాలకు హాజరయ్యేట్లు చూడాలని, పత్రికా స్వేచ్ఛకు గల పవిత్రతను కాపాడాలని కోరారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన
తెలంగాణలో మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతినిధులు చర్చించారు. ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతినిధిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియాపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీడియాపై ఇంత దారుణంగా విరుచుకుపడుతున్న వ్యక్తి మరెవ్వరూ లేరన్నారు.
మీడియాపై కక్ష సాధింపు తగదు
Published Mon, Sep 15 2014 12:43 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement