మోదీ టీ అమ్మిన రైల్వేస్టేషన్‌కు మహర్దశ! | Railway station where PM Narendra Modi sold tea gets Rs 8 crore for facelift | Sakshi
Sakshi News home page

మోదీ టీ అమ్మిన రైల్వేస్టేషన్‌కు మహర్దశ!

Published Sat, Apr 22 2017 1:29 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

మోదీ టీ అమ్మిన   రైల్వేస్టేషన్‌కు మహర్దశ! - Sakshi

మోదీ టీ అమ్మిన రైల్వేస్టేషన్‌కు మహర్దశ!

సచానా(అహ్మదాబాద్‌): ప్రధాని మోదీ తన బాల్యంలో టీ అమ్మిన గుజరాత్‌లోని వాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు మహర్దశపట్టనుంది. ఆ స్టేషన్‌ అభివృద్ధి కోసం రూ. 8 కోట్లు కేటాయించినట్లు రైల్వే సహాయ మంత్రి సిన్హా తెలిపారు. తాను బాల్యంలో ఈ స్టేషన్‌లో తండ్రితో కలసి టీ అమ్మేవాడినని మోదీ గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తరచూ చెప్పడం తెలిసిందే.

మోదీ వాద్‌నగర్‌లోనే జన్మించారు. వాద్‌నగర్‌తోపాటు సమీపంలోని మోధెరా, పఠాన్‌ ప్రాంతాలను రూ. 100 కోట్లతో పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేస్తారని, వాద్‌నగర్‌ స్టేషన్‌ అభివృద్ధి ఈ ప్రాజెక్టులో భాగమని రైల్వే అధికారులు చెప్పారు. వాద్‌నగర్‌–మెహ్‌సనా రైలు మార్గంలోని మీటర్‌ గేజ్‌ను బ్రాడ్‌ గేజ్‌లోకి మార్చే ప్రాజెక్టు ఇప్పటికే మొదలైందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement