ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించిన ఎయిర్‌టెల్
టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ నిన్ననే రూ.597తో ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాయిస్ కాల్స్ ఎక్కువగా చేసుకునే వారిని ఉద్దేశించి 168 రోజుల వాలిడిటీలో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఒక్కరోజుల్లోనే మరో సరికొత్త ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆవిష్కరించింది. బేసిక్ లెవల్ యూజర్ల కోసం 75 రూపాయలతో సరికొత్త ప్లాన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ ఎంట్రీ-లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ కింద యూజర్లకు 28 రోజుల పాటు 300 నిమిషాల ఉచిత కాల్స్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 1 జీబీ 2జీ/3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. వాయిస్ కాల్స్‌లో లోకల్, ఎస్టీడీ, అవుట్ గోయింగ్ రోమింగ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి.
కాగ, అంతకముందే ఎయిర్‌టెల్ రూ.47తో ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దాని వాలిడిటీ కూడా 28 రోజులే. ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్రత్యర్థి ఐడియా సెల్యులార్ కూడా రూ.75 ప్లాన్‌ను కలిగి ఉంది. ఐడియా కూడా తన ప్లాన్‌పై 300 నిమిషాల కాలింగ్, 1జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లనే ఆఫర్ చేస్తోంది. అయితే ఐడియా కేవలం ఈ ప్లాన్‌ను తన 4జీ సర్కిల్ వినియోగదారులకే అందిస్తోంది. ప్రభుత్వ రంగ టెల్కో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కూడా రూ.75 ప్లాన్ ఆఫర్ చేస్తోంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ వాలిడిటీ 15 రోజులే. ఇది అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. అయితే దానిపై ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేవు. బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లకు ఈ ప్లాన్ కింద 10 జీబీ 3జీ డేటా, 500 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment