
మేమూ ఇస్తాం ఫ్రీ కాల్స్..
టెలికం రంగం మళ్లీ వేడెక్కుతోంది. ఒకవైపు కస్టమర్లంతా డేటా వైపు వేగంగా మళ్లుతుంటే..
• పోటా పోటీగా అన్‌లిమిటెడ్ ప్యాక్స్
• రిలయన్స్ జియో బాటలో టెల్కోలన్నీ
• తాజాగా ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ ఆఫర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగం మళ్లీ వేడెక్కుతోంది. ఒకవైపు కస్టమర్లంతా డేటా వైపు వేగంగా మళ్లుతుంటే.. అంతే వేగంగా ఇప్పుడు వాయిస్ కాల్స్‌పైన ఆఫర్ల మీద ఆఫర్లను టెల్కోలు ప్రకటిస్తున్నారుు. అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్‌తో చొచ్చుకుపోతున్న రిలయన్స్ జియోకు మేమూ పోటీ ఇస్తామంటున్నారుు.
కస్టమర్లు మరో కంపెనీ వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు కుస్తీ పడుతున్నారుు. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ యూజర్లు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు వాట్సాప్ వంటి యాప్‌లను విరివిగా వాడుతున్నారు. ఇటువంటి యూజర్ల వారుుస్ కాల్స్ వాడకం తగ్గుతోంది కూడా. అరుునప్పటికీ టెల్కోలు వారుుస్ కాల్స్‌ను ఫ్రీగా ఇస్తున్నారుు. దీంతో కస్టమర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అపరిమిత వారుుస్ కాల్స్ ప్యాక్స్ అందుబాటు ధరలో ఉండడం ప్రీపెరుుడ్ వినియోగదార్లకు కలసి వచ్చే అంశం.
కంపెనీలన్నీ రూ.149 ధరలో..
అపరిమిత డేటాతోపాటు వారుుస్ కాల్స్‌ను జియో ప్రస్తుతం అందిస్తోంది. ఈ వెల్కం ఆఫర్‌ను 2017 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆఫర్ ముగిసిన తర్వాత కస్టమర్ ఏ డేటా ప్యాక్ తీసుకున్నా దేశవ్యాప్తంగా అన్ని వారుుస్ కాల్స్ ఉచితం. అలాగే రూ.149 ప్యాక్ కాల పరిమితి 28 రోజులు. 0.3 ఎంబీ 4జీ డేటా కూడా పొందవచ్చు. ఈ ప్యాక్ అన్ని కంపెనీల దృష్టి పడేలా చేసింది. జియో దూకుడుకు ముందుగా రిలయన్‌స కమ్యూనికేషన్‌స(ఆర్‌కాం) జవాబిచ్చింది. రూ.149 ధరలో 28 రోజుల వాలిడిటీతో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వారుుస్ కాల్స్ ప్యాక్‌ను ప్రకటించింది. అలాగే 300 ఎంబీ 4జీ డేటాను ఉచితంగా ఇస్తోంది.
త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్..
భారత టెలికం రంగంలో ప్రస్తుతం అతి తక్కువ కాల్, డేటా రేట్లను బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ చేస్తోంది. ఆర్‌కాం మాదిరి ప్యాక్‌ను జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. రూ.149 ధరలో అన్‌లిమిటెడ్ వారుుస్ ప్యాక్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. రిలయన్‌స జియో మాదిరి ఆఫర్లను అందిస్తామని ఇది వరకే ఆయన స్పష్టం చేశారు. ఇక టెలినార్ తన సొంత నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ కాల్ ప్యాక్స్‌ను తీసుకొచ్చింది.
టెలికం సర్కిల్‌లో టెలినార్ నుంచి టెలినార్‌కు రూ.64 ప్యాక్‌తో 28 రోజుల పాటు ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. ఐడియా నుంచి ఐడియాకు అపరిమిత లోకల్ కాల్స్‌ను 28 రోజుల వాలిడిటీతో రూ.247 ధరలో ప్యాక్‌ను పొందవచ్చు. లోకల్, ఎస్టీడీ అన్‌లిమిటెడ్ ప్యాక్ రూ.698 ధరలో ఉంది. వొడాఫోన్ రూ.349 ప్యాక్‌లో సొంత నెట్‌వర్క్‌లో లోకల్ కాల్స్‌ను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ సైతం..
పోటీలో నేను సైతం అంటూ ఎయిర్‌టెల్ తాజాగా రెండు ప్యాక్‌లను 28 రోజుల వాలిడిటీతో ప్రకటించింది. రూ.349 ప్యాక్‌తో దేశవ్యాప్తంగా అన్ని కాల్స్ ఉచితం. 1 జీబీ 4జీ/3జీ డేటా కూడా దీనికి అదనం. అలాగే రూ.148 ప్యాక్ కింద దేశవ్యాప్తంగా ఎరుుర్‌టెల్ నంబర్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎంబీ 4జీ/3జీ డేటా సైతం అందిస్తోంది. రెండింటిలో బేసిక్ మొబైల్ యూజర్లు ఏ ప్యాక్ తీసుకున్నా 50 ఎంబీ డేటా ఉచితమని ఎయిర్‌టెల్ ఇండియా మార్కెట్ ఆపరేషన్‌స డెరైక్టర్ అజయ్ పురి తెలిపారు.