
న్యూఢిల్లీ: ఐడియా సెల్యులర్ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ సంస్థ, ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి భారీగా నిధులు సమీకరించనున్నది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు 32.66 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించి రూ.3,250 కోట్లు సమీకరిస్తున్నట్లు ఐడియా సెల్యులర్ తెలిపింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.99.50 ధరకు కేటాయించాలని తమ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఐడియా సెల్యులర్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన బిర్లా టీఎమ్‌టీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలైనె ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), ఒరియానా ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్), సూర్య కిరణ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్(సింగపూర్)లకు ఈ షేర్లు కేటాయిస్తామన్నారు. ఈ షేర్ల కేటాయింపు వచ్చే నెల ప్రారంభంలోనే పూర్తవుతుందని, దీనివల్ల ఐడియాలో ప్రమోటర్‌గ్రూప్ వాటా ప్రస్తుత 42.4 శాతం నుంచి 47.2 శాతానికి పెరుగుతుందని బిర్లా పేర్కొన్నారు.
అదనంగా మరో రూ3,5000 కోట్లు సమీకరణ
అదనంగా మరో రూ.3,500 కోట్ల నిధుల సమీకరణ కోసం అన్వేషించాల్సిన మార్గాల నిమిత్తం ఒక ప్యానెల్‌ను నియమించామని కుమార మంగళం తెలిపారు. ఇండస్ టవర్స్‌లో కంపెనీకున్న 11.15% వాటాను కూడా విక్రయించాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారాయన. ఈ ఏడాది వోల్ట్ (వాయిస్ ఓవర్ 4జీ) సేవల నూ అందించాలని యోచిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment