కస్టమర్లకు ఐడియా తీపికబురు | Idea to sell 2G, 3G, 4G mobile data at same price from Mar-end | Sakshi

కస్టమర్లకు ఐడియా తీపికబురు

Mar 17 2017 5:47 PM | Updated on Sep 5 2017 6:21 AM

కస్టమర్లకు ఐడియా తీపికబురు

కస్టమర్లకు ఐడియా తీపికబురు

మొబైల్‌ వినియోగదారులకు శుభవార్త. టెలికం ఆపరేటర్‌ ఐడియా సెల్యులార్‌ మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐడియా 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లన్నింటికి కూడా ఒకే ధరల్లో డేటా ప్లాన్స్‌ను విక్రయించనుంది.

న్యూఢిల్లీ: మొబైల్‌ వినియోగదారులకు శుభవార్త. టెలికం ఆపరేటర్‌ ఐడియా సెల్యులార్‌ మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐడియా 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లన్నింటికి కూడా ఒకే ధరల్లో డేటా ప్లాన్స్‌ను విక్రయించనుంది. మార్చి ఆఖరు నుంచి ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రారంభించనుంది. ‘1జీబీ అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్స్‌ను 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు సమాన ధరల్లో విక్రయించాలని నిర్ణయించాం. డేటా ప్లాన్స్‌ ధరల్లో నెట్‌వర్క్‌ను బట్టి మార్పు ఉండదు. 2017, మార్చి 31నుంచి దీనిని అమలుచేస్తున్నాం’ అని ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

వాస్తవానికి 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు వేర్వేరుగా ఐడియా డేటా ప్లానింగ్స్‌ ధరలు ఉంటాయి. అయితే, రిలయన్స్‌ జియో అందిస్తున్న 4జీ మొబైల్‌ డేటా సర్వీసు​ ఐడియా 2జీకి ఇచ్చే ధరకంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జియో నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తాజాగా తన నిర్ణయాన్ని ఐడియా మార్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement