ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది.
డీల్ విలువ రూ.1,288 కోట్లు
న్యూఢిల్లీ: ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ, ఐడియాలో తనకున్న మొత్తం 3.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రావిడెన్స్ సంస్థ అమ్మేసింది. ఈ విక్రయం విలువ రూ.1,288 కోట్లని అంచనా. ఐడియాలో వొడాఫోన్ విలీనమవుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయం జరగడం విశేషం.
ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ, తన ఇన్వెస్ట్‌మెంట్ విభాగం పీ5 ఏషియా ఇన్వెస్ట్‌మెంట్ (మారిషస్) ద్వారా 12 కోట్ల షేర్లను విక్రయించిందని బీఎస్‌ఈ బల్క్ డీల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ షేర్ల సగటు విక్రయ ధర రూ.107.32గాఉంది.