ఉదయం శిబిరం నుంచి వెలుపలికి రాగానే ఆరోగ్యశ్రీ సేవలు అందని మరో విషాద గాథ తెలిసింది. కురుకాల్వకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శశిని ఎత్తుకుని వచ్చారు వాళ్ల అమ్మా, నాన్నలు. వారిది చాలా పెద్ద బాధ. కంటికి సంబంధించిన క్యాన్సర్‌తో ఆ పాప బాధపడుతోందట. ఒక కన్ను పోయిందట. ఇప్పుడు రెండో కంటికి సోకిందని, దానికి సంబంధించిన వైద్యం హైదరాబాద్‌లో మాత్రమే ఉందని చెబితే.. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు వెళితే ‘ఇప్పుడు ఇది చెల్లదు.. డబ్బు కడితేనే వైద్యం’ అన్నారట.