అన్నదాతకు కాసుల కష్టాలు
► పరిష్కారం కాని నగదు, చిల్లరి సమస్య
► కొనసాగుతున్న ప్రజల ఇబ్బందులు
► చేతికి డబ్బు అందక అన్నదాతల అవస్థలు
► పాడిరైతులకు అందని బిల్లులు
►విత్‌డ్రా ఆంక్షలతో రూ. 8.50కోట్ల మేర చెల్లింపులకు బ్రేక్
►నగదు సమస్యతో మందగించిన క్రయవిక్రయాలు
► సరకు విక్రరుుంచుకోలేకపోతున్న మొక్కజొన్న, పత్తి రైతులు
► దళారులు ముందుకు రాక, కొనుగోలు కేంద్రాల్లేక లావాదేవీలు నిల్
పెద్దనోట్ల రద్దు వ్యవహారం అన్నదాతల బతుకును కుంగదీసింది. పండిన పంట అమ్ముకోలేక.. కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపులు లేక పత్తి, మొక్క జొన్న రైతు సతమతమవుతున్నాడు. చేసేది లేక దళారులు కోరిన మొత్తానికి తెగనమ్ముకోవాల్సి వస్తోంది. పాడిరైతులు రోజూ పాలు పోస్తున్నా... విత్‌డ్రాపై ఆంక్షలతో సకాలంలో బిల్లులు అందక పశువుల దాణా కొనుగోలు చేయలేక.. ఇంటి ఖర్చులు గడవక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఏ రైతును కదిపినా... రోజువారీ ఖర్చులకు తామెంత అవస్థలు పడుతోందీ వేదనతో... కన్నీటి రోదనతో చెబుతున్నాడు.
అలా సర్దుకుపోతున్నారు..
విజయనగరం గంటస్తంభం: పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన సమస్య ఇంకా కొనసాగుతోంది. బ్యాంకుల్లో నగదు లేకపోవడం, ఏటీఎంలో రాకపోవడంతో ప్రజలకు సర్దుకుపోవడం మినహా మరో గత్యంతరం కనిపించడం లేదు. పన్నెండురోజులైనా జిల్లాలో సమస్యలు అలాగే ఉన్నారుు. సోమవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు నగదు, ఏటీఎంల్లో రూ. 2వేలు మాత్రమే ఉపసంహరణ చేసుకునే పరిస్థితి ఉండడంతో జనం ఆమాత్రం సొమ్ముతోనే సరిపెట్టుకున్నారు.
నగదు లేక ఇబ్బంది
ఇదిలాఉంటే ఆ మాత్రం సొమ్ము కూడా కొన్ని బ్యాంకుల్లో లభించడంలేదు. జిల్లాలో సోమవారం చాలా బ్యాంకులు నగదు కొరతతో పూర్తిస్థారుులో సేవలందించలేకపోయారుు. నగదు జిల్లాకు వస్తుందని అధికారులు చెప్పినా సోమవారం లావాదేవీలకు అందుబాటులోకి రాలేదు. కొన్ని బ్యాంకుల్లో రోజంతా విత్‌డ్రాలకు అవకాశం ఉండగా మరికొన్ని బ్యాంకులు ఆ రోజు వచ్చిన డిపాజిట్ల ధర, బిల్లు ఎప్పుడిస్తారో భరోసా లేకుండా ఉన్న పళంగా పంటను అమ్ముకున్నారు.
వీరే కాదు మొక్కజొన్న, ధాన్యం రైతులు కూడా పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు. విత్‌డ్రా ఆంక్షలు ఉండటం, దళారుల దగ్గర నగదు లేకపోవడం, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య దళారుల గొంతెమ్మ కోర్కెలెక్కువవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం డివిజన్‌లో మొక్కజొన్న, ప్రత్తి సాగు రైతులు ఎక్కువగా ఉన్నారు. వారంతా పండిన పంటను ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ వరి సీజన్ ముందు కావడంతో ఇప్పటికే ధాన్యం గింజలు చేతికొచ్చేసారుు. ఇప్పుడవి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లేక, నోట్లు రద్దుతో దళారులు మొండికేయడం వంటి పరిస్థితుల మధ్య రైతన్నలు నష్టపోతున్నారు. మొన్నటి వరకు క్వింటా ప్రత్తి ధర రూ. 4,800ఉండగా దళారుల ఇష్టారాజ్యంతో ఇప్పుడది రూ. 4,300కి పడిపోరుుంది. అలాగే, క్వింటా మొక్కజొన్న రూ. 1350వరకు ఉండగా ఇప్పుడది రూ. 1100కి పడిపోరుుంది.
పాడి రైతులపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు పాడి రెతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరికి నోట్ల కష్టాలు తప్పడం లేదు. 15రోజులుగా బిల్లులు అందకపోవడంతో కుటుంబాలను నెట్టుకు రాలేకపోతున్నారు. ఒకవైపు కుటుంబాన్ని పోషించుకోలేక, మరోవైపు పశువులకు దాణా కొనుగోలు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 79వేల మంది పాడి రైతులు వివిధ పాలకేంద్రాలకు పాలు సరఫరా చేస్తున్నారు. 15రోజులకు 2లక్షల 46వేల లీటర్ల పాలు పోస్తున్నారు. వీరికి 15రోజుల కొకసారి రూ. 8కోట్ల 50లక్షల మేర బిల్లులు చెల్లిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో వీరికి చెల్లింపులు నిలిచిపోయారుు. విత్‌డ్రాపై ఆంక్షల ప్రభావం చెల్లింపులపై పడింది.
సాధారణంగా సొసైటీ కార్యదర్శులు బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసి, సొసైటీల వద్ద రైతులకు చెల్లిస్తారు. ఇప్పుడా బ్యాంకుల వద్ద నగదు విత్‌డ్రాపై ఆంక్షలుండటంతో కార్యదర్శులు నగదు డ్రా చేయలేకపోతున్నారు. పాడి రైతులకు చెల్లించలేకపోతున్నారు. ప్రస్తుతానికి రూ. 8.5కోట్ల మేర బిల్లులు అందక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించలేకపోవడంతో పాటు ఉపాధిగా మారిన పాడి పశువులకు దాణా కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు.
డెయిరీల వారీగా లావాదేవీలివి
డెయిరీ సొసైటీలో వేసే పాలు(లీ) 15రోజులకు
రైతులు చెల్లించాల్సినది (రూ.)
విశాఖ 58,950 1,82,000 రూ. 6.28కోట్లు
హెరిటేజ్ 24వేలు 6,700 రూ. 79.20లక్షలు
తిరుమల 4800 15వేలు రూ. 52.14లక్షలు
జెర్సీ 3,940 12,800 రూ. 42.24లక్షలు
సిటీమిల్క్ 2600 8వేలు రూ. 26.40లక్షలు
సుప్రజ 1100 4,200 రూ. 13.23లక్షలు